రెండేళ్ల కిందట కేరళలో(Kerala) ఓ హత్య జరిగింది. సూరజ్‌ అనే అనే వ్యక్తి తన భార్యను పాముతో కాటేయించి చంపేశాడు. అదనపు కట్నం(Dowry) కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన నుంచి ప్రేరణ పొందారో తెలియదు కానీ గోదావరిఖనిలో అచ్చంగా ఇలాంటి మర్డరే జరిగింది.

రెండేళ్ల కిందట కేరళలో(Kerala) ఓ హత్య జరిగింది. సూరజ్‌ అనే అనే వ్యక్తి తన భార్యను పాముతో కాటేయించి చంపేశాడు. అదనపు కట్నం(Dowry) కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన నుంచి ప్రేరణ పొందారో తెలియదు కానీ గోదావరిఖనిలో అచ్చంగా ఇలాంటి మర్డరే జరిగింది. కాకపోతే ఇందులో భర్తను భార్య హత్య చేసింది. అందుకు కారణం ఓ మహిళతో వివాహేతర(Extra Marital Affair) సంబంధాన్ని పెట్టుకుని, డబ్బంతా ఆమెకే ఇచ్చేస్తున్నాడన్న కోపం!

గోదావరిఖనిలో నివాసం ఉంటున్న ప్రవీణ్‌(Praveen) రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. విలేకరిగా తన ప్రస్థానం ప్రారంభించిన ప్రవీణ్‌ 15 ఏళ్ల కిందట మందమర్రికి చెందిన లలితను పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు గోదావరిఖనికే చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఫలితంగా భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వీటిని మర్చిపోవడానికి ప్రవీణ్‌ రోజూ తాగేసి ఇంటికి వెళ్లేవాడు. భర్త ఆగడాలను భరించలేకపోయిన లలిత ఎలాగైనా సరే అతడిని వదిలించుకోవాలనుకుంది. అందుకో ప్లాన్‌ వేసింది. సెంట్రింగ్‌ పనుల కోసం తరచూ ఇంటి దగ్గరకు వచ్చే సురేశ్‌కు తన సమస్య చెప్పుకుంది.

తన భర్తను చంపేందుకు సాయం చేయమని కోరింది. సురేశ్‌ తొలుత ఇందుకు ఒప్పుకోలేదు. పోలీసులకు దొరికితే కుటుంబం ఇబ్బందిపాలవుతుందని చెప్పాడు. ఓ ప్లాట్‌ రాసి ఇస్తానంటూ నచ్చచెప్పింది. అలా ఒప్పందం చేసుకుంది. మొదట ఎవరికీ అనుమానం కలగకుండా మద్యం మత్తులో నిద్రిస్తున్న ప్రవీణ్‌ మొహంపై దిండును అదిమి చంపాలని అనుకున్నారు. అప్పటికీ చనిపోకపోతే పాముతో కాటేసి చంపించి సహజ మరణంగా చిత్రీకరించాలనుకున్నారు. ప్రవీణ్‌ను చంపాలనే నిర్ణయం తీసుకున్న లలిత, మచ్చ సురేశ్‌లు సాయం కోసం ఇందారం సతీశ్‌ను సంప్రదించారు. మరోమిత్రుడు మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్‌ను సంప్రదించి పాములు పట్టే వ్యక్తి కావాలని చెప్పారు.

శ్రీనివాస్‌ తనకు పరిచయ ఉన్న భీమ గణేశ్‌ ద్వారా మందమర్రి ఏరియాలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్‌ను సంప్రదించారు. హత్యా పథకాన్ని అమలు చేయడానికి కొంత డబ్బు అడ్వాన్స్‌గా కావాలని సురేశ్‌ అడిగారు. అందుకోసం తన దగ్గర ఉన్న 34 గ్రాముల బంగారు గొలుసు ఇచ్చింది లలిత. అక్టోబర్‌ 9వ తేదీన పాము అందుబాటులో ఉందని మచ్చ సురేశ్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు చంద్రశేఖర్‌. ఆ రోజే ప్రవీణ్‌ను చంపాలని నిర్ణయించారు. ఆ రోజు అందరూ రామగుండంలో కలిశారు.

మద్యం తాగుతూ ప్రవీణ్‌ కదలికలను గురించి లలిత ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రవీణ్‌ నిద్రపోయిన తర్వాత ఆ విషయాన్ని లలిత నిందితులకు చెప్పింది. దీంతో సురేశ్‌, అతడి అనుచరులు రెండు బైకులపై ప్రవీణ్‌ ఇంటికొచ్చారు. వారి రాకకోసం ఎదురుచూస్తున్న లలిత ఇంటి ముందున్న తలుపులు తెరిచి ఉంచారు. వారు వచ్చిన తర్వాత బెడ్‌రూమ్‌లో పడుకున్న ప్రవీణ్‌ను చూపించి తను మరో గదిలోకి వెళ్లిపోయారు లలిత. సురేశ్‌ చద్దరుతో ప్రవీణ్‌ ముఖం, ముక్కుపై అదిమిపట్టి శ్వాసఆడకుండా చేశాడు. అతడి అనుచరులు ఇందారపు సతీశ్‌, భీమ గణేశ్‌, మాస శ్రీనివాసు.. ప్రవీణ్‌ కాళ్లు, చేతులు గట్టిగా అదిమిపట్టుకుని సురేశ్‌కు సహకరించారు.

ఒకవేళ ఇలా చనిపోకపోతే పాము కాటుతో చంపేయాలని తన మిత్రుడు చంద్రశేఖర్‌ సాయంతో పాము కాటు వేయించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత సురేశ్‌, అతడి మిత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పామును గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత లలిత తన భర్తది సహజమరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. గుండెనొప్పితో మరణించాడని ఇరుగుపొరుగువారికి చెప్పింది. శవాన్ని ప్రీజర్‌లో పెట్టి అంతిమసంస్కారాలకోసం ఉంచింది. ప్రవీణ్‌ తల్లికి ఎందుకో అనుమానం వచ్చింది.

పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. లలితను విచారించడంతో వాస్తవాలు వెలుగులోకివచ్చాయి. తానే హత్య చేయించినట్లు ఆమె ఒప్పుకుంది. ఈమేరకు నిందితులు కొచ్చర లలిత (34), మచ్చ సురేశ్‌ (37), ఇందారపు సతీశ్‌(25), సన్నపరాజు చంద్రశేఖర్‌(38), లారీ క్లీన్‌ భీమ గణేశ్‌(23) , లారీ డ్రైవర్‌ మాను శ్రీనివాస్‌(33)లను అరెస్ట్‌ చేసి, వారినుంచి మూడు ద్విచక్రవాహనాలు, ఆరు మొబైల్‌ఫోన్లు, 34గ్రాముల బంగారు చైన్‌స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. సమావేశంలో సీఐ ప్రమోద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated On 14 Oct 2023 12:58 AM GMT
Ehatv

Ehatv

Next Story