Brother anil Kumar : బ్రదర్ అనిల్‌కుమార్‌ను దూరం పెట్టిన షర్మిల
మొన్నటికి మొన్న కాంగ్రెస్‌లో(Congress) చేరిన వై.ఎస్.షర్మిల(YS sharmila) ప్రస్తుతం తన కుమారుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. వెడ్డింగ్ కార్డులను పంచడంలో తీరిక లేకుండా ఉన్నారు. సాధారణంగా వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి వెళుతున్నప్పుడు భార్యాభర్తలు కలిసి వెళుతుంటారు. అదేమిటో కానీ షర్మిల ఒక్కరే మనకు కనిపిస్తున్నారు. అంటే భర్త బ్రదర్ అనిల్‌కుమార్(Brother Anil Kumar) విషయంలో షర్మిల జాగ్రత్త పడుతున్నారనిపిస్తోంది.
మొన్నటికి మొన్న కాంగ్రెస్‌లో(Congress) చేరిన వై.ఎస్.షర్మిల(YS sharmila) ప్రస్తుతం తన కుమారుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. వెడ్డింగ్ కార్డులను పంచడంలో తీరిక లేకుండా ఉన్నారు. సాధారణంగా వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి వెళుతున్నప్పుడు భార్యాభర్తలు కలిసి వెళుతుంటారు. అదేమిటో కానీ షర్మిల ఒక్కరే మనకు కనిపిస్తున్నారు. అంటే భర్త బ్రదర్ అనిల్‌కుమార్(Brother Anil Kumar) విషయంలో షర్మిల జాగ్రత్త పడుతున్నారనిపిస్తోంది. కొన్ని కారణలవల్ల అనిల్‌కు సమాజంల చెప్పుకోదగ్గర గౌరవం లేదనే భావన ఉంది. ఈ నేపథ్యంలో తన భర్త అనిల్‌కు కాస్త దూరంగా పెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నారని కొందరు అంటున్నారు.
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నప్పుడు కూడా అనిల్ పార్టీ కండువా వేసుకోలేదు. ఇది కూడా చర్చనీయాంశమయ్యింది. ఇప్పుడు పెళ్లి పనులన్నింటినీ షర్మిల ఒక్కరే చూసుకుంటున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సంబంధించి ప్రముఖులకు షర్మిల ఆహ్వానాలు అందజేస్తున్నారు. వీటిలో ఎక్కడా షర్మిల వెంట అనిల్ కనిపించడం లేదు.
మొదటి ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సమాధి దగ్గర పెట్టే సందర్భంలో కూడా బ్రదర్ అనిల్ కనిపించలేదు. అలాగే తన అన్న వైఎస్ జగన్‌ను ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు కూడా షర్మిల వెంట అనిల్ లేరు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించడానికి కూడా వై.ఎస్.షర్మిల ఒక్కరే వెళ్లారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను(Radha Krishna) ఆహ్వానించడానికి కూడా షర్మిల ఒక్కరే వెళ్లడాన్ని గమనించొచ్చు. పూర్తిగా కుటుంబ వ్యవహారానికి సంబంధించిన వేడుకకు రావాలని ఆహ్వానించడానికి షర్మిల తన భర్తతో వెళ్లకపోవడమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.