ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైసీపీ(YCP) ఓటమిపాలై కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావొస్తొంది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైసీపీ(YCP) ఓటమిపాలై కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావొస్తొంది. జగన్‌ ఓడిపోయి 60 రోజులు కావొస్తున్నా కానీ అన్ని పార్టీలు జగన్‌ను కాల్చేందుకే తుపాకులు ఎక్కుపెట్టాయి. టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP), కాంగ్రెస్‌(congress), టీడీపీ అనుకూల మీడియా, ఆఖరికి వామపక్షాలు కూడా జగనే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. మరోవైపు జగన్‌ను విమర్శించే విషయంలో ఓ పది అడుగులు ముందే వేస్తున్నారు షర్మిల. జగన్‌ను రాష్ట్ర రాజకీయాల నుంచి లేకుండా చేస్తే ఇక తమరికి తిరుగుండదని కొన్ని పార్టీలు భావిస్తున్నాయేమో తెలియదు కానీ విమర్శ కోసం విమర్శలు చేసినట్లుగానే అనిపిస్తుంది. 2019లో కూడా టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ పార్టీ పుంజుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది కదా. తెలంగాణలో కూడా 2018-23లో కాంగ్రెస్‌ 19 స్థానాలే గెలిచింది.. అయినా ఆ పార్టీ 2023లో మరోసారి అధికారంలోకి వచ్చింది. జగన్‌ పార్టీని రూపుమాపాలనే ఆలోచన అవివేకం అవుతుంది తప్ప మరొకటి లేదు.

రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కేంద్రం ప్రభుత్వ నిర్మాణాలు కూడా జగన్‌ వల్లే ఆగిపోయాయని ప్రభుత్వం విమర్శిస్తోంది. ఉదాహరణకు ఎయిమ్స్, గిరిజనవర్సిటీ కొన్ని లీగల్ సమస్యల వల్ల నిర్మాణాలు పూర్తి కాలేకపోవడానికి జగనే కారణమని విమర్శిస్తున్నారు. మరి అంతకుముందున్న టీడీపీ హయాంలో ఇవన్నీ ఎందుకు పూర్తికాలేదో తెలియదు. క్రెడిట్‌ వస్తే తమ ఖాతాలో డెబిట్ వస్తే జగన్‌ ఖాతాలో వేయాలని ప్రభుత్వాలు, ఇటు టీడీపీ అనుకూల పత్రికలు రెడిగా ఉంటాయి.

జగన్‌ అమరావతి వచ్చినా, బెంగళూరు వెళ్లినా ఆయన ప్రతి మూమెంట్‌పై పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రతి విషయంలో ఏదో ఒక తప్పు దొరికితే దానికి జగన్‌నే బాధ్యుడిని చేస్తున్నారు. జగన్‌ ఢిల్లీలో చేసిన ధర్నాపై మొదటగా స్పందించింది షర్మిలనే. అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీ వెళ్లి ఏంచేస్తావని జగన్‌ను ప్రశ్నించింది. కానీ జగన్‌ ఢిల్లీలో చేసిన ధర్నా ఇండి పక్షాల దృష్టిని ఆకర్షించింది. ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ జంతర్‌మంతర్‌లో చేపట్టిన ధర్నాకు అఖిలేష్‌(akilesh) సహా పలువురు ఇండి పక్షాల నేతలు వచ్చి సంఘీభావం తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్‌ ధర్నా చేస్తున్నా కానీ బీజేపీ అగ్రనేతలెవరూ దీనిని వ్యతిరేకించలేదు. జగన్‌ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి దగ్గరగా ఉన్నాడనే అంశం తెరపైకి వచ్చింది.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(revanth reddy) కూడా జగన్‌ను టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో విమర్శలు చేస్తున్నారు. అసలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం తెలంగాణ ముఖ్యమంత్రిది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వైఎస్‌ను ప్రకృతి ఏంచేసిందో మనం చూశామని భారీ డైలాగులు కొట్టిన రేవంత్‌రెడ్డి, అదే వైఎస్‌ జయంతి సభకు వెళ్లి ఆయనకు సంతాపం తెలపడం విడ్డూరంగా అనిపించడం లేదా. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఉన్నసమయంలో ఓటుకు నోటు దొంగకు పీసీసీ చీఫ్ ఇచ్చారని షర్మిల విమర్శించలేదా. తండ్రిని అవమానకరరీతిలో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి షర్మిలకు ఈరోజు మిత్రుడయ్యాడు. ఈ సందర్భంగా జగన్‌పై రేవంత్‌ విమర్శలు గుప్పించారు. కడపకు ఉప ఎన్నిక వస్తే ఇంటింటికీ తిరిగి షర్మిలను గెలిపిస్తాననడం వినడానికే విచిత్రంగా ఉంది.

చివరాఖరుకు వామపక్షాలు కూడా జగనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. బీజేపీని విమర్శించే వామపక్షాలు బీజేపీ భాగస్వామ్యపక్షాల ప్రభుత్వ ఉన్నా, హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్‌నే ఎందుకు ప్రశ్నిస్తున్నాయన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. ఏపీలోని అన్ని రాజకీయపక్షాలు మాత్రం జగన్‌ను సెంట్రిక్‌గా చేసుకున్నాయి. దీనికి తోడు తెలంగాణలో రేవంత్‌ కాంగ్రెస్‌ కూడా జగన్‌ను టార్గెట్‌ చేసుకుంది.

Eha Tv

Eha Tv

Next Story