TTD Chairman Post : ఆ మీడియా అధినేతకు టీటీడీ ఛైర్మన్ పదవి ఎందుకివ్వట్లేదు?
మొదటి నుంచి తెలుగుదేశంపార్టీకి(TDP) అనుకూలంగా ఉన్న ఓ ఛానెల్ అధినేతకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్(TTD Chairman) పదవి ఇస్తారంటూ ఆ మధ్య బోల్డన్నీ కథనాలు వచ్చాయి.
మొదటి నుంచి తెలుగుదేశంపార్టీకి(TDP) అనుకూలంగా ఉన్న ఓ ఛానెల్ అధినేతకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్(TTD Chairman) పదవి ఇస్తారంటూ ఆ మధ్య బోల్డన్నీ కథనాలు వచ్చాయి. ఆయనకు ఆ పదవి రాకుండా మరో మీడియా అధిపతి అడ్డం పడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా టీటీడీ ఛైర్మన్ పదవి విషయాన్ని మాత్రం తేల్చలేకపోతున్నది. ఆ ఛానెల్ అధినేతకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై చంద్రబాబు పునరాలోచనలో పడ్డారట! అందుకే ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత రద్దు చేశారట! పోయిన శనివారం రోజున సదరు ఛానెల్ అధినేతను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారట! రెండు రోజుల తర్వాత మళ్లీ రమ్మనమని చెప్పి పంపించేశారట! దాంతో ఆయన తనకు టీటీడీ ఛైర్మన్ పదవి పక్కా అని అనుకున్నవారై తెగ సంబరరపడ్డారట! చంద్రబాబు చెప్పినట్టుగా రెండు రోజుల తర్వాత ఆయనను కలవడానికి వెళ్దామనుకునేలోపు సీఎంవో నుంచి ఓ కబురు వచ్చిందట! 'ప్రస్తుతానికి మీతో చంద్రబాబు మాట్లాడే ఆలోచనలో లేరు. ఏదైనా సమాచారం వుంటే చెబుతాము' అన్నది ఆ కబురు సారాంశం. అంటే మీడియా అధినేతతో చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఏదో జరిగి ఉంటుంది. ఆ మీడియా అధినేతను కొంత మంది అదృశ్య శక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. అందుకే చంద్రబాబు ఆలోచన మారిందని చెబుతున్నారు. ఇక తనకు ఆ పదవి రాదేమోనని ఆ ఛానెల్ అధినేత ఫిక్సయ్యారట! చంద్రబాబుపై కోపంగా ఉన్నారట!