ఏపీలో ప్రస్తుతం సస్పెన్షన్ల రాజకీయాలు నడుస్తున్నాయి.. తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో (MLC Elections) క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP). విప్‌ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు (sajjala rama krishna reddy).

ఏపీలో ప్రస్తుతం సస్పెన్షన్ల రాజకీయాలు నడుస్తున్నాయి.. తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో (MLC Elections) క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP). విప్‌ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు (sajjala rama krishna reddy). ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేశారు.. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి వైసీపీలో చేరారు నలుగురు ఎమ్మెల్యేలు వారిలో కరణం బలరాం (Karanam Balaram), వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi), వాసుపల్లి గణేష్ (Vasupalli Ganesh),మద్దాలి గిరిధర్ (Maddali Giridhar) ఉన్నారు.. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు.. క్రాస్ వోటింగ్ వేశారనే కారణంతో దైర్యంగా తన పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన జగన్.. అదే ధైర్యంతో బాబు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Updated On 30 March 2023 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story