తెలుగుదేశం పార్టీ జాతీయ(TDP) ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్‌(Nara Lokesh) ఎందుకోకానీ మొన్నటి టీడీపీ-జనసేన(Janasena) సంయుక్త సభలో కనిపించలేదు. సభకు నాయకులు హాజరుకాకపోవడమన్నది పెద్ద విషయం కాదు. రకరకాల కారణాల వల్ల, బిజీ షెడ్యూళ్ల వల్ల నేతలు సభకు గైర్హాజరు అవుతుంటారు. కానీ నారా లోకేశ్‌ హాజరుకాకపోవడాన్ని అంత ఈజీగా తీసిపారేయ్యడానికి లేదు.

తెలుగుదేశం పార్టీ జాతీయ(TDP) ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్‌(Nara Lokesh) ఎందుకోకానీ మొన్నటి టీడీపీ-జనసేన(Janasena) సంయుక్త సభలో కనిపించలేదు. సభకు నాయకులు హాజరుకాకపోవడమన్నది పెద్ద విషయం కాదు. రకరకాల కారణాల వల్ల, బిజీ షెడ్యూళ్ల వల్ల నేతలు సభకు గైర్హాజరు అవుతుంటారు. కానీ నారా లోకేశ్‌ హాజరుకాకపోవడాన్ని అంత ఈజీగా తీసిపారేయ్యడానికి లేదు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ-జనసేన ఉమ్మడి మీటింగ్‌కు లోకేశ్‌ వెళ్లకపోవడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. శంఖారావం పేరుతో లోకేశ్‌ వివిధ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. సభకు జరిగినప్పుడు ఆయన మంగళగిరిలోనే ఉన్నారు. అయినా ఆయన అటెండ్‌ అవ్వలేదు. గతంలో లోకేశ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు టీడీపీ - జనసేన పొత్తుకు విఘాతం కలిగించేలా, టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తల మధ్య మనస్ఫర్థలు తెచ్చేలా ఉన్నాయని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. జననసే నాయకత్వం కూడా అలాగే అనుకుంటోంది. ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశంపైన ఇంకా సందిగ్ధ వాతావరణాన్ని కొనసాగించాలని రెండు పార్టీలు అనుకుంటున్నాయి. కానీ సీట్ల సర్దుబాటులో జనసేనకు కేటాయించిన స్థానాలను చూసిన తర్వాత ఎవరికైనా ఓ విషయం అర్థమైపోతుంది. అదేమిటంటే పవర్‌ షేరింగ్‌లో పవన్‌ కల్యాణ్‌ ఉండడని! ఇది పవన్‌కు కూడా తెలుసు.

Updated On 1 March 2024 2:53 AM GMT
Ehatv

Ehatv

Next Story