మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. జగన్‌ వెంట పార్టీ నేతలు కూడా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తలపడుతున్న అరాచకాలు దేశ ప్రజలందరికీ

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. జగన్‌ వెంట పార్టీ నేతలు కూడా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తలపడుతున్న అరాచకాలు దేశ ప్రజలందరికీ తెలిసేలా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ధర్నా చేపడుతోంది.ఈ ధర్నాలో జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు అందరూ పాల్గొనబోతున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే జగన్‌ ఉంటారు. ఇప్పటికే ఆయన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోమ్‌మంత్రితో పాటు పలువురి అపాయింట్‌మెంట్‌ కోరారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో సాగుతోన్న హింసాత్మక ఘటనలు, దాడులపై జగన్‌ వీరికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పినందుకు, లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పినందుకు రాష్ట్రపతి పాలన విధించాలని జగన్‌ కోరుతున్నారు. పలు జాతీయ పార్టీ నాయకులకు కూడా జగన్‌ కలుస్తారు. వారిని కూడా ధర్నాకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. రేపటి ధర్నాలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరగుతున్న హింసాత్మక ఘటనలను ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో ప్రదర్శించబోతున్నారు.

Updated On 23 July 2024 6:38 AM GMT
Eha Tv

Eha Tv

Next Story