వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy), వై.ఎస్‌.షర్మిలా రెడ్డి(YS Sharmila) మధ్య జరుగుతోన్న ఆస్తుల తగదా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది.

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy), వై.ఎస్‌.షర్మిలా రెడ్డి(YS Sharmila) మధ్య జరుగుతోన్న ఆస్తుల తగదా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరికి వారు తమ వాదనలను వినిపించుకుంటున్నారు. తండ్రి రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన ఆస్తుల పంపకం ఎప్పుడో జరిగిపోయిందని, షర్మిలకు దక్కాల్సినవి ఆమెకు దక్కాయని, తాను సంపాదించిన ఆస్తులలో వాటా ఇస్తానందుకే ఈ గొడవ అని జగన్‌ అంటున్నారు. షర్మిల మాత్రం జగన్‌ను తల్లి చెల్లికి ఆస్తులు ఇవ్వని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారు. రోజుకో కొత్త అంశంతో జగన్‌ను తిట్టిపోస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రియమిత్రుడు, ఓ రకంగా వైఎస్‌ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు(KVP Ram chandra rao) మాత్రం ఇప్పటి వరకు ఈ ఇష్యూపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేవీపీ రామచంద్రరావు చెబితే అసలు ఏం జరిగిందన్న దానికి క్లారిటీ రావచ్చు. శనివారం విలేకరుల సమావేశంలో షర్మిల కన్నీరుకారుస్తూ వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. అంతకు మునుపు జగన్‌కు రాసిన లేఖలో కేవీపీ రామచంద్రరావు ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల. మరి ఇప్పటి వరకు ఆయన రియాక్టవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు షర్మిల ఉద్దేశంలో జగన్‌ మోచేతి నీళ్లు తాగే వాళ్లే అనుకుందాం! మరి కేవీపీ రామచంద్రరావు అలా కాదే! ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు. ఆయన షర్మిలకు మద్దతుగా మాట్లాడాలి. మరి ఆయన ఎందుకు పెదవి విప్పడం లేదు? షర్మిల చెబుతున్నది ఆయనకు నచ్చడం లేదా? మరి ఎందుకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మ మాట్లాడటం లేదు?

Eha Tv

Eha Tv

Next Story