భారీ వర్షాలకు(Heavy rains) ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) అతలాకుతలం అయ్యింది.

భారీ వర్షాలకు(Heavy rains) ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) అతలాకుతలం అయ్యింది. కృష్ణానదికి(Krishna river) వరద పోటెత్తడంతో విజయవాడ(Vijayawada) నగరం జలమయమయ్యింది. కృష్ణానది కరకట్ట ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటే రాజధాని అమరావతిలో(Amaravathi) కూడా వరద నీరు వచ్చింది. అయితే వరద నీటిలో అమరావతి ఉందనే ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యతను తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా భుజాన వేసుకుంది. స‌చివాల‌యం, ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల నివాస సముదాయాలు, అసెంబ్లీ త‌దిత‌ర ప్రాంతాల్లో ఎలాంటి వ‌ర‌ద నీళ్లు లేవ‌ని ఫొటోలు ప్ర‌చురించాయి. ఇంత యాక్టివ్‌గా ఉన్న టీడీపీ అనుకూల మీడియా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrabab naidu) ఇల్లు వరద నీటిలో ఉందని మాత్రం చెప్పడం లేదు. అసలు దాని ఊసు కూడా ఎత్తడం లేదు. అంటే చంద్రబాబు నివాసం వరద నీటిలో ఉందని అర్థమవుతోంది. అందుకే ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు.

Eha Tv

Eha Tv

Next Story