జనసేన పార్టీలో(Janasena) పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) తర్వాత రెండో స్థానంలో ఉంటూ పవన్‌కు చేదోడువాదోడుగా నాదేండ్ల మనోహర్‌(Nadendla manohar) ఉన్నారు.

జనసేన పార్టీలో(Janasena) పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) తర్వాత రెండో స్థానంలో ఉంటూ పవన్‌కు చేదోడువాదోడుగా నాదేండ్ల మనోహర్‌(Nadendla manohar) ఉన్నారు. ఎన్నికలకు ముందు పవన్‌తో కలిసి నడిచారు. పవన్‌ చేసే ప్రతి కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్‌ పాల్గొనేవారు. అన్నీ తానై చూసుకునేవారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దూసుకెళ్లారు. రేషన్‌ షాపుల్లో బియ్యం అవకతవకలపై ఉక్కుపాదం మోపారు. ఆకస్మిత తనిఖీలు, నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ అక్కడిక్కడే పరిష్కారం చేసి పెట్టారు.ఒక మంత్రిగా నిత్యం తన శాఖ మీద సమీక్షలు నిర్వహిస్తూ, ఒక ఎమ్మెల్యే గా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక జనసేన నేతగా పార్టీ కార్యకర్తలు, నేతలకు సమయం కేటాయిస్తూ అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు నాదెండ్ల. అయితే నాదెండ్ల దూకుడుకు అడ్డుకట్ట వేశారని ఇంటర్నల్ చర్చ అయితే ఒకటి నడుస్తోంది. అధినేత కంటే ఎక్కువ దూకుడు నెం.2 ప్రదర్శిస్తున్నారన్ననెపంతో నెమ్మదిగా ఆయనను కాస్త పక్కకు జరిపినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే అయితే వరదల సందర్భంగా రేషన్‌ విషయంలో నాదెండ్లకు చంద్రబాబు(Chandrababu) క్లాస్‌ పీకారు. దీంతో ఆయన కూడా కాస్త నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ కూడా లోకేష్‌కు(Lokesh) అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నాదెండ్ల సహచరులు గొణుక్కుంటున్నారు. ఈ వార్తలకు పవన్‌ తిరుమల(Tirumala) పర్యటన కూడా ఊతమిస్తోంది. పవన్‌ కల్యాణ్ చిన్నచిన్న కార్యక్రమంలో పాల్గొనే నాదెండ్ల మనోహర్‌.. తిరుమల పర్యటనలో ఎక్కడా కనపడలేదు. లడ్డూ వివాదం విషయంలో పవన్‌ కల్యాణ్‌ తిరుమల వెళ్లి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో కానీ, ఆ దీక్షను విరమించిన సమయంలో కానీ నాదెండ్ల మనోహర్‌ కనపడలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పవన్ కల్యాణ్ టీడీపీకి దగ్గరవుతూ నాదెండ్లను దూరం పెడుతున్నారన్న వార్తలయితే వస్తున్నాయి. ఇందువల్లే ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరుగుతోందని తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story