Shyamala Trolls : శ్యామల మొదటి వీడియోపై ఎందుకన్ని విమర్శలు?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR congress) అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత యాంకర్ శ్యామల(Shyamala) సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR congress) అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత యాంకర్ శ్యామల(Shyamala) సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. మొదటి వీడియోతోనే ఆమె అటెన్షన్ డ్రా చేసుకోగలిగింది. మొదటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ వీడియోపై విమర్శలు కూడా వెల్లువెత్తతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ(TDP) సోషల్ మీడియా టీమ్ శ్యామలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నది. వాస్తవానికి శ్యామల ఇంకాస్తా హోమ్‌వర్క్ చేసి ఉండాల్సింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu), ఆయన కుమారుడు లోకేశ్‌లపై(Lokesh) శ్యామల వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండాల్సింది అని వైసీపీ సానుభూతిపరులే అంటున్నారు. శ్యామల ట్రోల్ కావడానికి ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు, లోకేశ్‌లు కనీసం పిల్లికి కూడా బిచ్చం పెట్టరనే విమర్శలతో ఆమె వీడియో మొదలు పెట్టింది. అసలు సమయం, సందర్భం లేకుండా ఆమె ఇలా ఎందుకు మాట్లాడారో ఎవరికీ తెలియదు. ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? ఆమె సొంతంగానే అలా మాట్లాడారా అన్నది కూడా తెలియదు. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి దానగుణం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఫర్వాలేదు. కానీ చంద్రబాబు, లోకేశ్‌లపై అనసరంగా వ్యక్తిగత విమర్శలు చేయడమే చాలా మందికి నచ్చలేదు. అధికార ప్రతినిధిగా మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని, చక్కగా మాట్లాడినంత మాత్రాన సరిపోదని, ప్రసంగంలో మంచి విషయాలు ఉంటేనే ప్రజలకు సులభంగా చేరతాయని అంటున్నారు. తటస్థులు కూడా ఇలాంటి ప్రసంగాలనే ఇష్టపడతారు. ప్రత్యర్థులకు అనవసరంగా ఓ అస్త్రాన్ని ఇచ్చినట్టు అయ్యిందని కొందరు అంటున్నారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశంపార్టీకి చెందిన ఉండవల్లి అనూష యాంకర్ శ్యామలకు కౌంటర్ ఇచ్చారు. మొదటి వీడియోలోనే శ్యామల డకౌట్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఎగిరి ఎగిరి పడుతూ వీడియో చేశారని, అందులో కంటెంట్ ఏమీ లేదని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌లు జనాలకు ఎంతో చేశారని చెబుతూ, నీ వల్లే జగన్ ఓడిపోయారని అన్నారు. మొత్తంగా శ్యామల తన మొదటి వీడియోతోనే పది మంది దృష్టిలో పడ్డారు.