Pawan kalyan : పవన్ కల్యాణ్‌ది గెస్ట్ రోలే.. కూటమి సినిమాలో ఆయన హీరో కాదు!
కృష్ణ హీరోగా అప్పుడెప్పుడో గూఢచారి 116 సినిమా వచ్చింది. ఆ సినిమా ఆరంభంలో శోభన్‌బాబు(Shobhan babu) ఓ అయిదు నిమిషాలు కనిపిస్తాడు. దాన్ని మల్టీ స్టారర్ సినిమా అనలేం కదా! శోభన్‌బాబు హీరోనే. కానీ అందులో వేసింది గెస్ట్‌రోలే(Guest role)! పాపం ఇప్పుడు పవన్ కల్యాణ్(Pawan kalyan) పరిస్థితి కూడా అంతే అయ్యింది. తమ అభిమాన హీరో ముఖ్యమంత్రి అవుతారనే గంపెడాశలు పెట్టుకున్న జనసేన వీరాభిమానులపై నీళ్లు కుమ్మరించారు నారా చంద్రబాబునాయుడు.
కృష్ణ హీరోగా అప్పుడెప్పుడో గూఢచారి 116 సినిమా వచ్చింది. ఆ సినిమా ఆరంభంలో శోభన్‌బాబు(Shobhan babu) ఓ అయిదు నిమిషాలు కనిపిస్తాడు. దాన్ని మల్టీ స్టారర్ సినిమా అనలేం కదా! శోభన్‌బాబు హీరోనే. కానీ అందులో వేసింది గెస్ట్‌రోలే(Guest role)! పాపం ఇప్పుడు పవన్ కల్యాణ్(Pawan kalyan) పరిస్థితి కూడా అంతే అయ్యింది. తమ అభిమాన హీరో ముఖ్యమంత్రి అవుతారనే గంపెడాశలు పెట్టుకున్న జనసేన వీరాభిమానులపై నీళ్లు కుమ్మరించారు నారా చంద్రబాబునాయుడు. మీ హీరోకు అంత సీన్ లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు. పొత్తులో భాగంగా జనసేనకు(Janasena) చంద్రబాబు(Chandrababu) విదిల్చిన సీట్లను చూసి బిక్కచచ్చిపోయారు జన సైనికులు. 24 స్థానాలను తీసుకుని ఏం బాగుకుంటామన్నది పవన్ అభిమానుల నిర్వేదం. మొన్న పవన్ ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం! బలహీనంగా ఉన్న తెలుగుదేశంపార్టీకి(TDP) బలమిచ్చింది మనమేనని, ఆ పార్టీకి పైకి లేపుతున్నది కూడా మనమేనని చెప్పుకున్నారు కదా! మరి ఇదేమిటి? టీడీపీకి జీవన్‌టోన్ టానిక్ అయిన జనసేనకు మరి ఇంత తక్కువ సీట్లు ఇవ్వడమేమిటి? ఇప్పుడు ఏ పార్టీని ఎవరు పైకి లేపుతున్నట్టు? ముప్పాతిక శాతం సీట్లయినా తమకు ఇవ్వాల్సిందేనన్నది పాపం పెద్దాయన జోగయ్య డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు కూడా ఓ 60 నుంచి 70 సీట్లు అయినా దక్కుతాయని ఆశించారు. సినిమాల్లో పవన్ హీరో అయితే అయి ఉండవచ్చు. పాలిటిక్స్‌లో మాత్రం అతడికి గెస్ట్ రోలేనని చంద్రబాబు తీర్మానించేశారు. కథానాయకుడు ఎప్పుడూ ఒంటరిగానే విజయం సాధిస్తాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిబ్బరంగా వాటిని ఎదుర్కొంటాడు. హీరో క్వాలిటీనే అది. కానీ వారితోనో, వీరితోనో చేతులు కలిపి ప్రత్యర్థులను ఎదుర్కోడు! ఒక్కడే వెళతాడు. వెన్నంటి వస్తామని స్నేహితులో, మరొకరో అడిగినా వద్దంటాడు. పవన్ కల్యాణ్ నటించిన చాలా సినిమాలలో హీరో ఇలాగే చేస్తాడు. అందుకే ఫ్యాన్స్ హీరోలను లైక్ చేస్తారు. కాకపోతే పాలిటిక్స్‌లో పవన్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం సైడ్ హీరోలాగే ఉంది. టీడీపీ-జనసేన పొత్తు మల్టీ స్టారర్ సినిమా కాదని, పవన్‌ది అతిథి పాత్రేనని ఇప్పుడు అర్థమయ్యింది. మల్టీస్టారర్ సినిమాలో హీరోలిద్దరి పాత్రలు సమంగానే ఉంటాయి. పాటలు, ఫైటింగ్‌లు కూడా సమంగానే ఉంటాయి. కానీ టీడీపీ-జనసేన పొత్తు సినిమాలో పవన్‌కు ఈక్వల్ రోల్ సంగతి దేవుడెరుగు, కనీసం పావు వంతు ఇంపార్టెన్స్ కూడా దక్కలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకు ఇచ్చిన సీట్లు కేవలం 24! ఈ సీట్లతో పవర్ షేరింగ్ గురించి మాట్లాడటం అవివేకమే అవుతుంది.