Pawan Kalyan : పవన్ డిక్లరేషన్ ప్లాన్ ఎవరిది?
ఇన్నాళ్లు ఎక్కడా కనిపించని పలీనా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) ఎంతో శ్రమపడి, నీరసించిపోయి, సొమ్మసిల్లి పడిపోయి, నడవడానికి ఇబ్బందులు పడుతూ, దారిపొడవునా కూర్చుంటూ, అష్టకష్టాలు పడుతూ మొత్తం మీద తిరుమల(Tirumala) చేరుకున్నారు. అలిపిరి(Alipiri) నుంచి తిరుమల చేరడానికి ఆయనకు అయిదు గంటల సమయం పట్టింది. సరే తిరుమల చేరుకున్నాక శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారాయన! అక్కడే దర్శకుడు రెడీ లైట్స్ కెమెరా యాక్షన్ అని చెప్పకపోయినా పవన్ మాత్రం అద్భుతమైన నటనను కనబర్చారు. తన మూడో భార్య కూతురు పలీనా అంజని కొణిదెలను(Palina anjani konidela) వెంటపెట్టుకుని వచ్చారు పవన్. ఇప్పటి వరకు ఆ పాప ఫోటో ఒక్కటి కూడా ఎక్కడా కనిపించలేదు. అలాంటిది మొదటిసారి తిరుమలలో పవన్‌తో పాటు కనిపించింది. ఇందులో తప్పేముంది అంటారేమో! ఇన్నాళ్లు ఎక్కడా కనిపించని పలీనా అప్పుడు హఠాత్తుగా, అర్జెంటుగా, అకస్మాత్తుగా కనిపించారంటేనే తెలుస్తోంది పవన్ రాజకీయ క్రీడ ఏమిటో! పలీనా క్రిస్టియన్(Christian). పవన్ కల్యాణేమో హిందువు. పైగా సనాతన ధర్మ పరిరక్షకుడు. భార్య కూడా క్రిస్టియనే! ఆమె కోరిక మేరకే బాప్టిజం కూడా స్వీకరించారు పవన్. ఈ మాట ఆయన చెప్పారో సందర్భంలో! తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి! ఆ పని చేశారు పవన్. దాన్ని వీడియో తీయించారు. మీడియాకు అందచేశారు. తను చేసిన పని పది మందికి తెలిసేలా చేశారు. ఆయన ఉద్దేశమేమిటో క్లియర్‌గా అర్థమవుతోంది.'పవన్ ఎంతో గొప్ప మనిషో.. తన కూతురుతో డిక్లరేషన్(Declaration) ఇప్పించారు. అదే జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) మాత్రం ఎంతగా అడిగినా ఇవ్వనుపో అని చెప్పారు' అని చెప్పించుకోవడానికని ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడే పవన్ రాజకీయం ఏమిటో తెలిసిపోతుంది. అయితే ఇంతటి మహత్తరమైన ప్లాన్‌ను పవన్ వేసి ఉంటారని అనుకోవడం లేదు. పవన్ వెనుక ఎవరో ఉండి ఉండాలి. ఆ ఎవరనేది చెప్పాల్సిన అవసరం లేదు.