Mudragada Padmanabham : కాపు సామాజికవర్గంలో చెరగని 'ముద్ర' గడ
కాపు ఉద్యమాలకు పేటెంట్ ఆయనే! ఆయన వల్లే కాపులు సంఘటితం అయ్యారు. ఆయన వల్లే రాజ్యాధికారం కోసం పోరాటం సాగిస్తున్నారు. ఆయనే ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham). ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలో(TDP) ఉన్నప్పుడే మంత్రి పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి. స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం(Kapu Protest) కోసం ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు(Chandrababu) కావాలనే ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్ట్ చేయించి తీవ్రంగా అవమానించారు.
కాపు ఉద్యమాలకు పేటెంట్ ఆయనే! ఆయన వల్లే కాపులు సంఘటితం అయ్యారు. ఆయన వల్లే రాజ్యాధికారం కోసం పోరాటం సాగిస్తున్నారు. ఆయనే ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham). ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలో(TDP) ఉన్నప్పుడే మంత్రి పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి. స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం(Kapu Protest) కోసం ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు(Chandrababu) కావాలనే ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్ట్ చేయించి తీవ్రంగా అవమానించారు. దీంతో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత ముద్రగడ జనసేన(Janasena) పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. అయితే ఇక్కడ కూడా చంద్రబాబునాయుడే అడ్డుకున్నారు. కుల రాజకీయాల నేపథ్యంలో పొత్తులో ఉన్న కారణంగా ముద్రగడ చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, దానికి నాదేండ్ల మనోహర్(Nadendla manohar) సహకరించారనేది బహిరంగ రహస్యం. అయితే తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ కాపు(Pawan kalayn) ఉద్యమ సారధులైన ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామజోగయ్యలను(Chegondi Harirama jogaiah) పరోక్షంగా కామెట్ చేయడంపై కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాపులకు అండదండగా ఉంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీలో చేరడంతో కొంత బలం చేకూరనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి గోదావరి(Godhavari) జిల్లాల్లో 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పద్మనాభం చేరికతో పార్టీకి బలం పెరగనుంది. ఆదినుండి సీఎం వైయస్ జగన్ కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కానీ చంద్రబాబు రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా ఇస్తానని మోసం చేశారు. అలాగే కాపునేస్తం అందించి కాపు సామాజికవర్గంలో ఆర్దికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. అలాగే దాదాపు 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్ధులకు కేటాయించారు. కాపు నేస్తం తో ఎంతోమంది మహిళలకు సైతం ఆర్థికంగా బాసటగా నిలిచారు.చంద్రబాబు కుట్రలు వీళ్ళు పసిగడతారని జోగయ్యను, పద్మనాభంలాంటి వారని జనసేనలోకి రాకుండా చంద్రబాబు, మనోహర్ అడ్డుకున్నారు. అయితే ఇపుడు పద్మనాభం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరికతో కాపుల ఓట్ల జనసేన వైపు మళ్లకుండా కాకుండా ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉంది.