గాయత్రీ మంత్రం కూడా ఇరవైనాలుగు అక్షరాలే అంటూ ఊదరగొట్టిన జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఇప్పుడు 21 నంబర్‌కు ఏం చెబుతారు? 21 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటిన్నది త్రివిక్రమ్‌(trivikram) ఇంకా పరిశోధిస్తున్నారు కాబోలు! బలహీనపడిన తెలుగుదేశం పార్టీకి(TDP) ఊపిరిలూదుతున్నది తామేనంటూ ఆ మధ్యన పవన్‌ అన్నట్టు గుర్తు! ఆ లెక్కన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకోవాలి? ముష్టి విసిరినట్టు ఇప్పుడు 21 సీట్లు ఇస్తే మహదానందంగా పుచ్చుకుని తెగ సంబరపడిపోతున్నారు పవన్‌ కల్యాణ్‌.

గాయత్రీ మంత్రం కూడా ఇరవైనాలుగు అక్షరాలే అంటూ ఊదరగొట్టిన జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఇప్పుడు 21 నంబర్‌కు ఏం చెబుతారు? 21 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటిన్నది త్రివిక్రమ్‌(trivikram) ఇంకా పరిశోధిస్తున్నారు కాబోలు! బలహీనపడిన తెలుగుదేశం పార్టీకి(TDP) ఊపిరిలూదుతున్నది తామేనంటూ ఆ మధ్యన పవన్‌ అన్నట్టు గుర్తు! ఆ లెక్కన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకోవాలి? ముష్టి విసిరినట్టు ఇప్పుడు 21 సీట్లు ఇస్తే మహదానందంగా పుచ్చుకుని తెగ సంబరపడిపోతున్నారు పవన్‌ కల్యాణ్‌. వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేదుకు ఎంతటి త్యాగానికి అయినా సిద్ధమంటున్నారు. అలాగైతే 2014 ఎన్నికల్లోలాగా పోటీ చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా! కనీసం పరువైనా దక్కేది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా మొదలు కాకముందు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఓ పథకం ప్రకారం జనసేనకు కేటాయించే సీట్లపై కథనాలు రాస్తూ వచ్చాయి. ఆరంభంలో ఆ పత్రికలు చెప్పిన నంబర్‌ 32. ఈ మాత్రం సీట్లు ఇస్తే తీసుకోనే వద్దు అని పెద్దమనిషి హరిరామజోగయ్య చిలక్కి చెప్పినట్టు చెప్పుకొచ్చారు. 32 సీట్లు కాస్తా 24కు కుదించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడే చాలా మంది బిత్తరపోయారు. కాపు నేతలు అయితే రగిలిపోయారు. చంద్రబాబు కొమ్ముకాసే పత్రికలు 32 అని చెప్పాయి కదా! మరి 24కు ఎలా ఒప్పుకున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. 32 సీట్లను తెలుగుదేశం పార్టీ పక్కన తీసిపెట్టిన మాట వాస్తవమే! అయితే ఆ స్థానాలు జనసేనకు ఇవ్వడానికి కాదు! కాళ్లావేళ్లా పడి బీజేపీని పొత్తుకు ఒప్పించగలుగుతామన్న ధీమా చంద్రబాబులో(Chandrababu) ఉండింది. అందుకే ఎనిమిది అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోసం పక్కన పెట్టారు చంద్రబాబు. ఎలాగైతేనేమీ బీజేపీతో పొత్తు కుదుర్చుకోగలిగారు చంద్రబాబు. ఎనిమిది సీట్లు ఇస్తామంటే బీజేపీ అసలు ఒప్పుకోకపోతే పది ఇస్తామని బతిమాలారు చంద్రబాబు. జనసేనకు 24 స్థానాలు, బీజేపీకి పది స్థానాలు ఇస్తారేమోననుకున్నారు. కానీ చంద్రబాబు సంగతి తెలుసుగా! బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లను జనసేనకు కేటాయించిన సీట్ల నుంచే కోత పెట్టారు. జనసేన నుంచి మూడు సీట్లను కోసేసి వాటిని బీజేపీకి ఇచ్చారు చంద్రబాబు. ఇది తెలిసిన జనసేన కార్యకర్తలు తమకు వస్తున్న కోపాన్ని బలవంతంగా అదిమిపెట్టుకుంటున్నారు. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా టీడీపీతో చెలిమి చేయడమేమిటని లోలోపల మధన పడుతున్నారు. ఇంత పరాభవం జరిగిన తర్వాత కాపు సామాజికవర్గ ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయన్నది అనుమానమే! కాపు ఓట్లు పడకపోతే తెలుగుదేశం పార్టీ గెలవడం అసాధ్యం. ఈ విషయం పవన్‌కు తెలియంది కాదు. డిమాండ్‌ చేసే స్థాయిలో ఉండి కూడా ఇచ్చింది పుచ్చుకుని అదే మహద్భాగ్యం అని పవన్‌ ఎందుకు అంటున్నారో అర్థం కాని విషయం. తన అవసరం చంద్రబాబుకు ఉందని తెలిసి కూడా ఆయన ఆడిస్తున్నట్టు ఎందుకు ఆడుతున్నట్టు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విదిల్చిన 21 స్థానాలలో ఎన్ని చోట్ల జనసేన గెలవగలదు? పోనీ ముప్పాతిక స్థానాలు గెలిచిందే అనుకుందాం! అటువైపు టీడీపీకి అధికారం వచ్చిందే అనుకుందాం! జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారా? అన్నది కూడా అనుమానమే!

Updated On 12 March 2024 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story