తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఢిల్లీ(Delhi)కి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)ను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda)ను కలిశారు. దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. పొత్తుల(Alliance) గురించి చర్చించారు.

తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఢిల్లీ(Delhi)కి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)ను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda)ను కలిశారు. దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. పొత్తుల(Alliance) గురించి చర్చించారు. బీజేపీ పిలిస్తేనే చంద్రబాబు వెళ్లారంటోంది టీడీపీ అనుకూల మీడియా. అబ్బే చంద్రబాబే వచ్చి కలిశారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ పొత్తులపై చర్చలు ఫలప్రదమయ్యాయన్నది మాత్రం సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి చంద్రబాబు వచ్చి చాలా రోజులయ్యింది. ఇప్పటికీ ఎవరికెన్ని సీట్లు కేటాయిస్తున్నారో చెప్పడం లేదు. మామూలుగా అయితే ఢిల్లీలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పేవారు. ఇంచుమించు అర్ధరాత్రి సమావేశం జరిగింది కాబట్టి ప్రెస్‌మీట్‌ పెట్టే ఛాన్స్‌ లేకుండా పోయింది. కనీసం మరుసటి రోజైనా వివరాలు చెప్పేవారు. చర్చలలో ఏ మాత్రం సానుకూలత ఉన్నా అరగంటకు తక్కువ కాకుండా మాట్లాడేవారు. పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో విడమర్చి చెప్పేవారు. బీజేపీతో పొత్తు దేశానికి ఎంత అవసరమో గంటల కొద్దీ చెప్పుకొచ్చేవారు. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను అమితంగా పొగిడేవారు. ఇవన్నీ ఏమీ లేవు. బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత మౌనంగా చంద్రబాబు వచ్చేశారు. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న అమిత్‌ షా ఓ మీడియాతో ముచ్చటిస్తూ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తమతో కొత్త మిత్రులు కలిసివస్తారంటూ చెప్పారు. ఈ క్రమంలో తెలుగుదేశంపార్టీతో పొత్తు ఖరారు అయినట్టు అమిత్ షా ప్రకటించకపోవడం గమనార్హం. పొత్తుల విషయంపై ఆయన నర్మగర్భంగానే మాట్లాడారు. చూడబోతే బీజేపీ అధినాయకత్వం ఎక్కువ సీట్లనే డిమాండ్‌ చేసినట్టు ఉంది. బీజేపీ ప్రతిపాదనకు ఓకే చెబితే ఓ బాధ, ఒప్పుకోకపోతే మరో బాధ. ఏం చేయాలో చంద్రబాబుకు పాలుపోవడం లేదట! బీజేపీ పది లోక్‌సభ సీట్లను అడిగినట్టు సమాచారం. ఇన్నేసి స్థానాలను బీజేపీకి అప్పగించడానికి చంద్రబాబుకు మనసొప్పడం లేదు. అందుకే ఎటూ తేల్చుకుండా ఉంటున్నారు. ఒకవేళ బీజేపీ అడిగిన సీట్లను ఇవ్వడానికి చంద్రబాబు అంగీకారం చెబితే మాత్రం జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) మరోసారి త్యాగం చేయాల్సివస్తుంది. తన కోటాలోని సీట్లను తగ్గించుకుని బీజేపీకి అప్పగించాల్సి వస్తుంది.

Updated On 12 Feb 2024 1:09 AM GMT
Ehatv

Ehatv

Next Story