ఏపీలో ముందస్తు ఎన్నికలు నిజమేనా..? || Why Early Elections in AP..? || Journalist YNR Analysis
ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాలో వార్తలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.. నిజంగానే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. ఏ కారణంతో సీఎం జగన్ ముందస్తుకు వెళతారు, ఒక వేళ ముందస్తుకు వెళితే ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది. అయితే తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి..
ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాలో వార్తలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.. నిజంగానే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. ఏ కారణంతో సీఎం జగన్ ముందస్తుకు వెళతారు, ఒక వేళ ముందస్తుకు వెళితే ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది. అయితే తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.. వైఎస్సార్‌సీపీ (Ysrcp)కి చెందిన దాదాపు 45 మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు టీడీపీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu)చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీసాయి.. మరో వైపు జగన్ (CM Jagan) మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు.. కాబినెట్లోకి కొత్త మంత్రులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి.. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టే జగన్ ఇవన్నీ చేస్తున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఇందులో నిజమేత.. జగన్ ముందస్తుకు నిజంగానే వెళతారా.. ఏపీలో అసలు ఏం జరగబోతుంది..?