Hero Balakrishna : బాలకృష్ణ-రాధాకృష్ణల మధ్య ఎక్కడ తేడా కొట్టింది?
ఆల్ ఆఫ్ సడన్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడనుకోండి (భయపడకండి... ఆ ప్రమాదమేమీ ఉండదు). అప్పుడైనా ఆంధ్రజ్యోతిలో(Andhrajyothi) ఇందుకు సంబంధించిన వార్త వస్తుందా? బాలకృష్ణ ఫోటో వస్తుందా? చస్తే రాదు. అంగారక గ్రహం మీద మొట్టమొదట కాలు పెట్టిన వ్యక్తిగా బాలకృష్ణ నిలిచినా ఆ పేపర్‌లో మాత్రం న్యూస్ రాదు. హండ్రెస్ పర్సంట్ గ్యారంటీ! ఏమిటో చంద్రబాబును(Chandrababu) అమితంగా, గాఢంగా ప్రేమించే రాధాకృష్ణకు ఆయన వియ్యంకుడు బాలకృష్ణ అంటే మాత్రం ఎందుకో ద్వేషం.
ఆల్ ఆఫ్ సడన్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడనుకోండి (భయపడకండి... ఆ ప్రమాదమేమీ ఉండదు). అప్పుడైనా ఆంధ్రజ్యోతిలో(Andhrajyothi) ఇందుకు సంబంధించిన వార్త వస్తుందా? బాలకృష్ణ ఫోటో వస్తుందా? చస్తే రాదు. అంగారక గ్రహం మీద మొట్టమొదట కాలు పెట్టిన వ్యక్తిగా బాలకృష్ణ నిలిచినా ఆ పేపర్‌లో మాత్రం న్యూస్ రాదు. హండ్రెస్ పర్సంట్ గ్యారంటీ! ఏమిటో చంద్రబాబును(Chandrababu) అమితంగా, గాఢంగా ప్రేమించే రాధాకృష్ణకు ఆయన వియ్యంకుడు బాలకృష్ణ అంటే మాత్రం ఎందుకో ద్వేషం. ఇద్దరూ చంద్రబాబు క్యాంపులోని వారే అయినా బాలకృష్ణ అంటే రాధాకృష్ణకు పడదు. ఇందుకు బోచ్చడన్ని ఉదాహరణలు చూపించవచ్చు. ఆ మధ్యన చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కదా! రాజమండ్రి సెంట్రల్ జైలులో కొన్ని రోజులు ఉన్నారు కదా! అప్పుడు నారా లోకేశ్(Nara Lokesh), బాలకృష్ణలతో కలిసి పవన్ కల్యాణ్ ఓ ప్రెస్ మీట పెట్టారు. అప్పుడే టీడీపీతో పొత్తు ఉంటుందనే మాటను నొక్కి వక్కాణించారు. పవన్ మీడియాతో ముచ్చటిస్తుంటే వెనకాల లోకేశ్, బాలయ్యను వింటూ ఉండటమే విచిత్రం! అది అలా ఉంచితే, మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో లోకేశ్, పవన్(Pawan) ఫోటోనే వచ్చింది. బాలకృష్ణ ఫోటో రాకుండా చాలా తెలివిగా జాగ్రత్తపడ్డారు. మొన్నటికి మొన్న బాలకృష్ణ అల్లుడు లోకేశ్ సాగించిన పాదయాత్ర ముగింపు సభ వార్తలో, ఫోటోలో ఎక్కడా బాలకృష్ణ అగుపడలేదు. ఉద్దేశపూర్వకంగానే బాలయ్యను తొలగించారు. అందుకు కారణమేమిటో రాధాకృష్ణ చెప్పరు. బాలయ్య చెబుతాడన్న నమ్మకమూ లేదు. అయినా ఎవరి ఫోటో వేయాలో, ఎవరి వార్త రాయాలో అది రాధాకృష్ణ ఇష్టం. అది ఆయన పేపర్! ఆయన కష్టపడి సాధించుకున్న వార్త పత్రిక. ఫోటోలు వేయాలన్న రూలేమీ లేదు. చంద్రబాబు, లోకేశ్‌బాబులు బాలకృష్ణ-రాధాకృష్ణ(Radhakrishna) మధ్య సంధి కుదర్చడానికి ట్రై చేశారట! ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయట! అన్నట్టు...లోకేశ్ పాదయాత్ర ముగింపు సభ కవరేజ్‌లో ఆంధ్రజ్యోతిలో తమ నాయకుడి ఫోటోలు రాలేదన్న కోపంతో కావాలి బాలయ్య అభిమానులు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను తగులబెట్టారు. రాధాకృష్ణ ఇలాంటి వాటిని చాలా చాలా లైట్ తీసుకుంటారన్న సంగతి బాలయ్య ఫ్యాన్స్‌కు తెలియనట్టుంది!