AP Election Time : ఏపీలో చిత్రమైన రాజకీయ పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP ELection Time) సమయం దగ్గరపడింది. మరో మూడునాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పట్నుంచే ప్రధానపార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. పొత్తులకు సిద్ధమవుతున్నాయి. కూటములు కట్టే పనిలో పడ్డాయి. మొత్తానికి ఏపీలో ప్రస్తుతం చిత్రవిచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్‌ఆర్(YCP) కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని(CM Jagan) ఎదుర్కొనేందుకు పార్టీలు ఏకమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమింటే ఈ ఏకమయ్యేది చంద్రబాబుకు(Chandrababu) మేలు చేయడం కోసం కావడమే! చంద్రబాబు ఏ పార్టీతోనైనా జట్టు కట్టగలరు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP ELection Time) సమయం దగ్గరపడింది. మరో మూడునాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పట్నుంచే ప్రధానపార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. పొత్తులకు సిద్ధమవుతున్నాయి. కూటములు కట్టే పనిలో పడ్డాయి. మొత్తానికి ఏపీలో ప్రస్తుతం చిత్రవిచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్‌ఆర్(YCP) కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని(CM Jagan) ఎదుర్కొనేందుకు పార్టీలు ఏకమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమింటే ఈ ఏకమయ్యేది చంద్రబాబుకు(Chandrababu) మేలు చేయడం కోసం కావడమే! చంద్రబాబు ఏ పార్టీతోనైనా జట్టు కట్టగలరు. ఆయనకు సిద్ధాంతాల కంటే గద్దెనే ముఖ్యం. అధికారం కోసం ఏ పార్టీతోనైనా చెలిమి చేస్తారు. అది ఎన్నికల వరకే! ఆ తర్వాత ఆ పార్టీని వదిలేస్తారు. చంద్రబాబు బీజేపీతో(BJP) పొత్తు పెట్టుకున్నారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌తో(TRS) జట్టు కట్టారు. చివరాఖరికి కాంగ్రెస్‌తో(Congress) కూడా పొత్తు పెట్టుకున్నారు. ఇంతటి తెలివితేటలు మరో రాజకీయ నాయకుడి లేవు! ఏపీలో జగన్ పని అయిపోయిందని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని చంద్రబాబు-లోకేశ్‌లు పదే పదే చెబుతున్నప్పటికీ వారిలో తాము గెలుస్తామో లేదోనన్న అనుమానం ఉంది. అందుకే జనసేనతో(Janasena) పొత్తు పెట్టుకున్నారు. జనసేన జిందాబాద్ అంటున్నారు. పవన్ కల్యాణ్‌కు(Pawan kalyan) జై కొడుతున్నారు. పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఏపీలో మిగిలిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో కూడా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. తనకు అందరూ చేయూతనివ్వాలని విన్నవించుకుంటున్నారు. దేశానికి ఐటీని పరిచయం చేసింది తానేనని, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేసింది కూడా తానేనని చెప్పుకొచ్చే చంద్రబాబు తనకు మద్దతు ఇవ్వమంటూ ప్రతిపక్ష పార్టీలను అభ్యర్థించడం విశేషం. ఇంకో విచిత్రమేమింటే చంద్రబాబు నైజమేమిటో తెలిసి కూడా ఆయనకు కాంగ్రెస్, సీపీఐ, జనసేన, బీజేపీ నాయకులు భుజకీర్తులు తొడగడం. జగన్‌ను విమర్శిస్తూ చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అంటున్నారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ చీఫ్ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి .. ఇలా అందరూ జగన్‌ను విమర్శిస్తూ చంద్రబాబును ప్రశంసిస్తున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ తనవైపుకు తిప్పుకోగలుగుతున్నారంటే చంద్రబాబును మెచ్చుకుని తీరాలి!