Pawan kalayan : చంద్రబాబుకు తలంటు పోశారు సరే, మరి పవన్ కల్యాణ్ మాటేమిటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును(Chandrababu) సుప్రీంకోర్టు(Supreme court) గట్టిగా మందలించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును(Chandrababu) సుప్రీంకోర్టు(Supreme court) గట్టిగా మందలించింది. ఇంత పెద్ద వార్త ఈనాడు(Enadu) వెబ్‌సైట్‌లో ఎక్కడా లేదు. ఎంత వెతికినా కనిపించదు. చంద్రబాబు వంటి సత్యవాక్పరిపాలకుడిని ఎవరైనా తిడితే ఈనాడుకు కోపం రాదు మరి! అందుకే ఆ వార్తను ఉద్దేశపూర్వకంగానే ఇగ్నోర్ చేసింది. ఏబీఎన్(ABN), టీవీ5లు(TV5) ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా వ్యవహరించాయి. టీవీ 5 అధినేత బీఆర్ నాయుడుకు(BR Naidu) టీటీడీ ఛైర్మన్ పదవిని ఇస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీవీ5లో ఈ వార్త రావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే చేసిన తప్పుకు చంద్రబాబు అయితే సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) సంగతేమిటి? ఆయన చంద్రబాబు కంటే దారుణంగా అబద్ధాలాడిన పవన్‌ను ఎన్ని తిట్లు తిట్టాలి? గౌరవప్రదమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడకూడదన్న సోయి లేకపోతే ఎలా? అయోధ్య(Ayodhya) రామజన్మభూమి(Janmabhoomi) ప్రారంభం రోజు లక్ష తిరుమల లడ్డూలను పంపారని, వాటిలో పంది కొవ్వు(Pork Fat), గోమాంస కొవ్వు, ఫిష్ ఆయిల్(Fish oil) ఉన్నాయని పవన్ చెప్పుకొచ్చారు కదా! అయ్యా పవన్‌గా.. రామజన్మభూమి రామాలయం జనవరి 2024లో తెరచుకున్నదని, కల్తీ జరిగిందని అనుమానిస్తున్న ఏఆర్ డెయిరీ నెయ్యి జులై 2024 నాటిదని , అంతకు ముందు ఈ బ్రాండ్ నెయ్యి తిరుమలకు రాలేదని పవన్‌కు చెప్పవారు లేకపోయారు. ఈ ప్రశ్నలను అడిగే సాహసాన్ని జర్నలిస్టులు కూడా చేయలేకపోయారు. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చింది చెప్పేస్తే ఎలా? ఒకప్పుడు చే గువేరాను అమితంగా ఆరాధించి, జ్యోతిరావు ఫూలె, సావిత్రి బాయి ఫూలే అడుగుజాడలలో నడిచిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారం దాల్చారు. పైగా ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. దీక్షలో ఉంటూనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అది కూడా హీరోయిన్‌తో కలిసి! పైగా చెప్పులేసుకుని! నిజంగానే ఓ సనాతనవాది ఇలా చేస్తారా? అందుకే పవన్ తీరును చాలా మంది ఎండగడుతున్నారు. మొన్న వందేభారత్ ట్రైన్‌లో చిడతలు వాయిస్తూ జబర్దస్త్ కామెడీ చేసిన కొంపెల్ల మాధవీలతకు, గుడిమెట్లు కడిగిన పవన్‌కు పెద్దగా తేడా లేదని నెటిజన్లు అంటున్నారు. ఇంతగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌కు 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తిరుమలలో వేయికాళ్ల మంటపాన్ని కూల్చిన విషయం గుర్తు లేదా? అది సనాతన ధర్మంపై దాడిగా వపన్‌కు అనిపించలేదా? టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పింది చెవికెక్కించుకోరు. సుప్రీంకోర్టు చెప్పింది పట్టించుకోరు. పైగా దీక్ష విరమణ అంటూ తిరుమలకు వెళుతున్నారు పవన్. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా తిరుమల లడ్డూపై నాటకాలు ఆడటం భావ్యం కాదు! దేవుడి మీద నమ్మకం ఉంటే చేసిన తప్పును ఒప్పుకోవడం మంచిది.