కడపజిల్లా(Kadapa) టీడీపీలో(TDP) సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్(Election notification) రానుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎన్నికల సమయం దగ్గరపడ్డాక అభ్యర్థులను ఖరారు చేస్తే..అప్పటి వరకు టిక్కెట్ ఆశించి, భంగపడిన నేతలు పార్టీ గెలుపుకోసం పని చేస్తారా? లేక కత్తులు దూస్తారా? అనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కడపజిల్లా(Kadapa) టీడీపీలో(TDP) సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్(Election notification) రానుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎన్నికల సమయం దగ్గరపడ్డాక అభ్యర్థులను ఖరారు చేస్తే..అప్పటి వరకు టిక్కెట్ ఆశించి, భంగపడిన నేతలు పార్టీ గెలుపుకోసం పని చేస్తారా? లేక కత్తులు దూస్తారా? అనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

2019లో అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు చావోరేవో అన్నట్టు మారాయి. ఈసారి ఎన్నికల్లో ఓడితే పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. అధికార వైసీపీకి ధీటుగా అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాలని టీడీపీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే సీట్ల కేటాయింపు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్(CM Jagan) సొంత జిల్లా కడపలో సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. కడపజిల్లాలో ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉన్న నేతలు సీట్ల కేటాయింపు విషయాన్ని త్వరగా తేల్చాలని పట్టుబడుతున్నారు. కడప నియోజకవర్గం ఇంఛార్జీగా ఆర్.మాధవీరెడ్డిని(R. Madhavi Reddy) నియమించాక..టిక్కెట్ తనదేనన్న ధీమాతో జనంలోకి వెళ్లి ప్రచారం మొదలుపెట్టారు. అయితే గత ఇంచార్జీ అమీర్ బాబు(Aamir Babu), తన మేనకోడలు కార్పోరేటర్ ఉమాదేవి(Uma devi), జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గాప్రసాద్ కూడా వీరితోనే జతకట్టారు. ఇలా రెండు గ్రూపులుగా విడిపోయారు.

ఇక..ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి, సురేష్ నాయుడుల మధ్య గట్టిపోటీ ఉంది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక కత్తీమీద సాములా మారింది. రాయచోటిలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడి ఇంఛార్జీ రమేష్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మరోనేత రాంప్రసాద్ రెడ్డి రేసులో ఉన్నారు. రాయచోటిలోనూ అభ్యర్థి ఖరారు గరంగరంగా మారే పరిస్థితి ఉండటంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ..ఇక్కడ టీడీపీనే పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. రాజంపేట ఇంచార్జీ చెంగల్ రాయుడు టిక్కెట్ పై నమ్మకంతో ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన నరహరి రాజంపేట సీటుపైనే గురిపెట్టారు. ఇటువంటి తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య సంఖ్యత కుదుర్చితేనే ఆశించిన ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఈ విషయంలో ఇప్పటికైనా అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించకపోతే.. రానురాను పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

Updated On 25 Jan 2024 3:18 AM GMT
Ehatv

Ehatv

Next Story