విశాఖనగరం(Vishakanagaram) అధికార వైసీపీకి ప్రతిష్టాత్మకం. వైజాగ్‌పై(CM Jagan) స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. గత ఎన్నికల్లో నగరంలో 4 చోట్ల టీడీపీ గెలిచింది. రాష్ట్రం మొత్తం హవా నడిచినా విశాఖలో ఒక్కస్థానానికే పరిమితమైంది వైసీపీ.

విశాఖనగరం(Vishakanagaram) అధికార వైసీపీకి ప్రతిష్టాత్మకం. వైజాగ్‌పై(CM Jagan) స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. గత ఎన్నికల్లో నగరంలో 4 చోట్ల టీడీపీ గెలిచింది. రాష్ట్రం మొత్తం హవా నడిచినా విశాఖలో ఒక్కస్థానానికే పరిమితమైంది వైసీపీ. ఈ పరిస్థితుల్లో నగరంలోని కీలక నియోజకవర్గమైన తూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రంగంలోకి దింపి వచ్చే ఎన్నికల్లో తూర్పు తీరాన వైసీపీ జెండా ఎగరేయాలని ప్లాన్ చేసింది. అయితే..విశాఖ తూర్పులో ఎంవీవీకి పెద్దగా స్పందన కనిపించపోవడంతో అభ్యర్థి విషయంలో అధిష్టానం డైలమాలోపడింది.

విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు తీర్పు ఈ సారి తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది అధికార వైసీపీ. విశాఖకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా.. రాజకీయంగా వైసీపీకి సరైన ఫలితాలు రావటం లేదు. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishna babu) అడ్డాగా మారిపోయింది విశాఖ తూర్పు. విశాఖ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ(MVV Sathyanarayana) ఒక్కరే గెలుపొందారు. దీంతో కమ్మ సామాజికవర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణకు ధీటుగా అదే సామాజికవర్గానికి చెందిన ఎంవీవీని విశాఖ తూర్పు ఇంఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే.. కార్యకర్తలు పెద్దగా సహకరించడం లేదన్న తెలుస్తోంది. మరోవైపు విశాఖ తూర్పలో బలంగా ఉన్న యాదవ సామాజికవర్గం ఎంవీవీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే క్యాడర్ ఆయనకు దూరమైంది. నియోజకవర్గంలో చేపట్టిన బస్సు యాత్రకు స్పందన కరమైంది. ఎంవీవీ పాదయాత్రలకు కూడా పెద్దగా స్పందన రావడం లేదని తెలుస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును తమకు కేటాయించాలని యాదవ సామాజికవర్గం(Yadav Community) డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని ఎంపీక చేసేపనిలోపడినట్టు తెలుస్తోంది. మరి..యాదవ సామాజికర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేక ఎంవీవీని కొనసాగిస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‎గా మారింది.

Updated On 1 Feb 2024 2:53 AM GMT
Ehatv

Ehatv

Next Story