ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో(AP politics) అప్పుడప్పుడు కామెడీని కూడా పండిస్తుంటారు కొందరు. మరో నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికల(Elections) కోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటూనే ఎవరికి తోచింది వారు చెప్పేసుకుంటున్నారు. ఇప్పటి వరకైతే తెలుగుదేశం పార్టీతో(TDP) జనసేన(Janasena) పొత్తు పెట్టుకుంటుందని అనుకుంటున్నాం. బీజేపీతో అంటకాగుతున్న జనసేన ఏ విధంగా టీడీపీకి సపోర్ట్‌ ఇస్తుందన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో(AP politics) అప్పుడప్పుడు కామెడీని కూడా పండిస్తుంటారు కొందరు. మరో నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికల(Elections) కోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటూనే ఎవరికి తోచింది వారు చెప్పేసుకుంటున్నారు. ఇప్పటి వరకైతే తెలుగుదేశం పార్టీతో(TDP) జనసేన(Janasena) పొత్తు పెట్టుకుంటుందని అనుకుంటున్నాం. బీజేపీతో అంటకాగుతున్న జనసేన ఏ విధంగా టీడీపీకి సపోర్ట్‌ ఇస్తుందన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సరే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేశాయే అనుకుందాం! ఎన్నికల్లో ఆ కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి(CM) ఎవరు అవుతారు? టీడీపీ అధినేత చంద్రబాబునాయుడా?(Chandrababu) జనసేనాని పవన్‌ కల్యాణా?(Pawan kalyan) నారా లోకేశ్‌(Nara Lokesh) మాత్రం ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారని నొక్కి వక్కాణించారు. ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలలో గెలిస్తే ఆ పార్టీకి చెందినవారే ముఖ్యమంత్రి అవుతారు.

టీడీపీ అయితే జనసేనకు సగానికి సగం సీట్లు కేటాయించదన్నది విస్పష్టం. మహా అయితే 30, 40 సీట్లు ఇవ్వొచ్చు అంతే! చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేశ్‌ ఎప్పుడైతే చెప్పారో అప్పట్నుంచి జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్న ఓ సామాజికవర్గం రగిలిపోతున్నది. కాబోయే ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణే అని భావిస్తున్న ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఈ విషయంపై జనసేన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. లోకేశ్‌ మాటలను ఖండించనూ లేదు. అలాగని సమర్థించనూ లేదు. కానీ జనసేనాని పవన్‌కల్యాణ్‌ అన్న నాగబాబు(Nagababu) మాత్రం తన తమ్ముడే సీఎం అని చెబుతున్నారు. లేటెస్ట్‌గా విశాఖపట్నంలో రహస్యంగా కాపు నేతలతో ఓ సమావేశాన్ని నిర్వహించారు నాగబాబు. అందులో పవన్‌ కల్యాణే ముఖ్యమంత్రి అని చెప్పారట! లోకేశ్‌ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అన్నారట! ఆంధ్రప్రదేశ్‌లో రెండే సమాజికవర్గాలు ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటూ వస్తున్నాయని, ఈసారి మాత్రం మార్పు కచ్చితంగా వస్తుందని నాగబాబు చెప్పారట! పవన్‌కల్యాణ్‌ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారని కాపు నేతలతో చెప్పారట!

Updated On 6 Jan 2024 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story