విజయవాడను వరద(Vijaywada floods) ముంచెత్తడానికి కారణం భారీ వర్షాలు.
విజయవాడను వరద(Vijaywada floods) ముంచెత్తడానికి కారణం భారీ వర్షాలు. దాంతో పాటు బుడమేరు(Budameru) ప్రవాహం క్రమబద్దీకరణ కాకపోవడం. ఇందుకు పాలకులే కారణం. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిందనంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైకి(YCP) నెట్టేస్తున్నది. మరి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశంపార్టీ(TDP) ఏం చేసినట్టు? ఇంత నష్టం జరిగిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత చేపట్టారు. బుడమేరు 60 ఏళ్ల కిందట ఎలా ఉండిందో.. ఇప్పుడు అలాగే ఉంది. ఏ ప్రభుత్వమూ బుడమేరును నియంత్రించడానికి పూనుకోలేదు. ఇప్పుడు బురద రాజకీయాలు చేసుకుంటున్నాయి. 60 ఏళ్ల కిందట ఆంధ్రపత్రికలో వచ్చిన ఈ బ్యానర్ వార్త చూసినవారికి పాలక పక్షాల నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమవుతుంది.
అన్ని ప్రభుత్వాలు దారునంగా విఫలమయ్యాయి. 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పాలించింది. ఆ తర్వాత 1983 నుంచి 1989 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఉండింది. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశంపార్టీ అధికారాన్ని చెలాయించింది. ఇందులో ఎన్టీఆర్ పాలన ఆరు నెలలు కూడా లేదు. మిగతా అంతా చంద్రబాబుదే! అప్పుడు చంద్రబాబు ఏం చేసినట్టు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలించింది కదా! అప్పుడు పాలకులు ఎందుకు కళ్లుమూసుకున్నారు? 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బుడమేరును నియంత్రించాలని ఆయనకు అప్పుడు ఎందుకు అనిపించలేదు? ఆ తర్వాత అయిదేళ్లు పాలించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపడం సమంజసమేనా? ఇప్పటికైనా అధికారంలో ఉన్న చంద్రబాబు తగు చర్యలు తీసుకోవడం మంచిది. తర్వాత ప్రభుత్వాలకు ఈ అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా చంద్రబాబపైనే ఉంది. !