వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు..బీసీ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న అధికార పార్టీకి బలమైన అభ్యర్థే దొరికాడు. సిట్టింగ్ సీటు వదులుకుని వేరే జిల్లాలో ఎంపీగా పోటీ చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అధిష్టానం ఆదేశాలతో అక్కడి నుంచి అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారట మాజీ మంత్రి. మరి..నెల్లూరు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు..బీసీ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న అధికార పార్టీకి బలమైన అభ్యర్థే దొరికాడు. సిట్టింగ్ సీటు వదులుకుని వేరే జిల్లాలో ఎంపీగా పోటీ చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అధిష్టానం ఆదేశాలతో అక్కడి నుంచి అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారట మాజీ మంత్రి. మరి..నెల్లూరు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

పల్నాడుజిల్లా కేంద్రంగా ఉన్ననరసరావుపేట(Narsaraopet) ఎంపీ సీటు ఎప్పుడూ స్పెషలే. అభ్యర్థులు ఎక్కడివారైనా అందలమెక్కించడం ఈ నియోజకవర్గం(Constituency) స్పెషాలిటీ. ఈసారి అధికార పార్టీ కూడా అదే ప్రయోగం చేయబోతోంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Lavu Krishnadevarayalu) పార్టీ వీడటంతో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఎవరన్నచర్చ మొదలైంది. ఈసారి బీసీలకే(BC) అవకాశం ఇవ్వాలని భావించిన వైసీపీ..నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరును తెరపైకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి..1999లో నరసరావుపేట నుంచే ఎంపీగా గెలిచారు. 2004లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి(Raj mohan redy)..నరసరావుపేట నుంచి కాంగ్రెస్(Congress) ఎంపీ అయ్యారు. ముచ్చటగా మూడోసారి అదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‎ను(Anil kumar yadav)..నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలను..ఈసారి గుంటూరుకు మార్చాలని భావించింది. సిట్టింగ్ సీటును వదులకోవడానికి సిద్ధపడని ఆయన..పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఓసీ అభ్యర్థులనే బరిలోకి దించుతోంది. అందుకే నరసరావుపేట ఎంపీ సీటును బీసీలకు ఇచ్చి బ్యాలెన్స్ చేయాలని వైసీపీ అధిష్టానం భావించింది. దీంతో బీసీ అభ్యర్థి కోసం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. మొదట నాగార్జున యాదవ్‎కు(Nagarjuna Yadav) అవకాశం ఇవ్వాలని భావించినా.. పార్టీ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించారట. ఈ క్రమంలోనే సీఎం జగన్(CM Jagan) నేరుగా అనిల్ కుమార్ యాదవ్‎ను పిలిపించి.. నరసరావుపేట లోక్‎సభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. అధినేత నిర్ణయానికి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అదే వర్గానికి చెందిన అనిల్ కుమార్‎కి అందరూ మద్దతిస్తారన్న అంచనాతో ఉంది వైసీపీ. గతంలో నెల్లూరు నేతలు గెలిచినట్టే..అనిల్ కుమార్ యాదవ్ కు కూడా పేట కలిసొస్తుందని పార్టీ కేడర్ అంటోంది. వైసీపీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరిక లాంఛనమేనట. ఆయనే పేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడే అవకాశం ఉంది. అదే జరిగితే..నరసరావుపేటలో కమ్మ, బీసీ నేతల మధ్య ఫైట్ ఉండబోతోందన్నమాట.

Updated On 27 Jan 2024 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story