ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతోంది. కూటమి ఏర్పడిన తర్వాత మంత్రులుగా పనిచేస్తున్నవారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(CM Chandra Babu Naidu) ఇంటర్నల్ సర్వే నిర్వహించారట. మంత్రుల పనితీరుకు మార్కులు కూడా వేస్తున్నారని తెలుస్తోంది. జిల్లాల్లో ఎమ్మెల్యేలతో సఖ్యత, నియోజకవర్గాలపై పట్టు, సోషల్‌ మీడియా నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే విషయంలో మంత్రుల పర్ఫార్మెన్స్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కొందరు మంత్రుల పనితీరు పట్ల చంద్రబాబునాయుడు సంతృప్తిగా ఉన్న మరికొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి మార్కులు పొందిన మంత్రుల్లో నారాయణ(Narayana), గొట్టిపాటి రవికుమార్(Gottipati ravi kumar), బాల వీరాంజనేయస్వామి(Bala Veeranjaneya swamy), నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaiu), కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas), అనగాని సత్యప్రసాద్‌ (Satya prasad)ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan), మరో మంత్రి లోకేష్‌(Nara Lokesh) పనితీరు పట్ల కూడా చంద్రబాబు సంతృప్తిగానే ఉన్నారట. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న వార్తలు వస్తుండడంతో పనితీరు సరిగా లేని ఇద్దరు మంత్రులను తొలగించనున్నారని సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. మరొకరికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ స్థానాన్ని నాగబాబుతో భర్తి చేయనున్నారు. త్వరలోనే నాగబాబు చేత మంత్రిగా ప్రమాణం చేయిస్తారట. అయితే నాగబాబు ప్రమాణంతో పాటు.ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుకు కూడా మంత్రి పదవి ఇస్తారని సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరూ మంత్రులను సీఎం చంద్రబాబు హెచ్చరించినా.. ప్రయోజనం లేకపోవడంతో వేటు తప్పకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే వీరి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచన సైతం చేస్తున్నారని చెబుతున్నారు. సోషల్‌ మీడియాను సరిగా ఉపయోగించుకోకపోవడం, నియోజకవర్గాల్లో అతి జోక్యం, ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడంతో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామంచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌పై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. పట్టుబట్టి మంత్రివర్గంలో చేర్చుకున్నా అతని పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ఆయనపై సీఎం చంద్రబాబునాయుడు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రకు జిల్లా విజయనగరానికి చెందిన మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై కూడా చంద్రబాబుకు ఇదే ఉద్దేశం ఉందని సమాచారం. ఆయనకు కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. రాయలసీమ కడపజిల్లాకు చెందిన రాంప్రసాద్‌రెడ్డిని కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తరాంధ్రకే చెందిన పల్లా శ్రీనివాస్‌రావుకు చోటు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలే అవుతున్నందున.. మరికొంత సమయం ఇచ్చి చూద్దామని కూడా ఆలోచన చేస్తున్నారట. ఇలాగే మంత్రుల పనితీరు కొనసాగితే మాత్రం ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు సమాచారం.

ehatv

ehatv

Next Story