భారీ వర్షాలు(Heavy rains) తెలుగురాష్ట్రాలను ముంచెత్తాయి.

భారీ వర్షాలు(Heavy rains) తెలుగురాష్ట్రాలను ముంచెత్తాయి. కృష్ణానదికి(Krishna river) భారీగా వరద వచ్చింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇటు ఖమ్మం(Khammam), అటు విజయవాడను(Vijayawada) వరదనీరు అతలాకుతలం చేసింది. ఖమ్మం, విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతిపక్ష నేతలు సైతం వరద బాధిత ప్రాంతంలో పర్యటించారు. ఖమ్మం ప్రకాష్‌నగర్‌ను వరద నీరు ముంచెత్తగా విజయవాడలోని ఆర్‌ఆర్ నగర్, విద్యాధరపురం, విజయవాడ సెంట్రల్‌, బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతంలో వరద నీరు చేరింది. గత రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా విజయవాడలోని చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), మంత్రి లోకేష్‌(Lokesh) వరదబాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అధికారయంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో దింపి వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయినా కూడా ఉప ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ(Janasena) ప్రజలకు అండగా సమయంలో నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సెప్టెంబర్ 2న పవన్‌ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఇదే రోజు గబ్బర్‌సింగ్‌ సినిమాను రీరిలీజ్‌ చేశారు. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జగన్‌ కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చేప్పారు. గత ప్రభుత్వంపై పవన్‌ వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. వాతావరణశాఖ అధికారులు హెచ్చరించినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే వర్షాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పవన్‌ విమర్శించారు. 'కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కుతున్నావని ప్రశ్నిస్తే.. దూడ మేత కోసం' అన్నట్లు జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిందని జగన్‌పై విమర్శలు గుప్పించారు. కానీ నేడు అదేపవన్‌ బాధ్యాతాయుత పదవిలో ఉండి కూడా బాధితులను కనీసం పలకరించలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వరద బాధితులను పవన్ పరామర్శించకపోవడం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Eha Tv

Eha Tv

Next Story