ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) దగ్గరపడుతున్నాయి. మహా అయితే రెండునెల సమయం ఉందంతే! అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అభ్యర్థులను ప్రకటించి దూడుకు మీద ఉంది. అభ్యర్థులు కూడా ప్రచారంలో దిగిపోయారు. విపక్షాలు ఇంకా పొత్తులంటూ కాలయాపన చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) దగ్గరపడుతున్నాయి. మహా అయితే రెండునెల సమయం ఉందంతే! అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అభ్యర్థులను ప్రకటించి దూడుకు మీద ఉంది. అభ్యర్థులు కూడా ప్రచారంలో దిగిపోయారు. విపక్షాలు ఇంకా పొత్తులంటూ కాలయాపన చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు(TDP Janasena Alliance) పెట్టుకున్నాయి. కాకపోతే సీట్లు సర్దుబాటే ఇంకా జరగలేదు. అందుకు కారణంమూడో పార్టీగా బీజేపీ(BJP Party)ని చేర్చుకోవాలనుకోవడమే! బీజేపీ స్నేహహస్తం కోసం ఆల్‌రెడీ చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ(Delhi)కి వెళ్లివచ్చారు. అయినా సీట్లలెక్కలు ఇంకా తేలలేదు. బీజేపీ అధినాయకత్వం పెట్టిన ప్రతిపాదనకు చంద్రబాబుకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందని సమాచారం! వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)ని ఎలాగైనా సరే ఓడించి తీరాలని అటు చంద్రబాబు, ఇటు పవన్‌కల్యాణ్‌ గట్టిగా పంతం పట్టుకుని ఉన్నారు. తమ బలం సరిపోదని, బీజేపీ కూడా చేరితేనే జగన్‌ను ఓడించగలుగుతామని గ్రహించిన బాబు, పవన్‌లు మోదీషా ద్వయంపై ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి అవసరమేమిటో బీజేపీకి తెలుసు. అలాగే వీరి బలహీనతలు ఏమిటో కూడా తెలుసు! అందుకే తాము కోరిన, తాము ఎంపిక చేసుకున్న సీట్లు తమకు ఇవ్వాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది. బీజేపీ అడిగిన సీట్లు ఇస్తే సొంత పార్టీలోనే నేతలు తిరుగుబాటు చేస్తారేమోనన్న భయం చంద్రబాబును వెన్నాడుతోంది. సీట్ల షేరింగ్‌ విషయం ఆలస్యమవుతున్న కొద్దీ టీడీపీ-జనసేన(TDP-Janasena) అభ్యర్థులలో అసహనం పెరుగుతోంది. బీజేపీ పెద్దలను ఎలాగైనా ఒప్పించాలనే సదుద్దేశంతో పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. పవన్‌ ఢిల్లీకి వెళుతున్నారని, సీట్ల లెక్కలను ఓ కొలిక్కితీసుకుని వస్తారని గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది కానీ పవన్‌ మాత్రం ఢిల్లీకి వెళ్లడం లేదు. అందుకు కారణం బీజేపీ పెద్దల అపాయంట్‌మెంట్ దొరకపోవడమే! ఒకవేళ దొరికినా పవన్ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు అంగీకరిస్తారా? ఇప్పటికే సీట్ల కోసం కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరితే ఏం జరుగుతుందోనన్న భయం రెండు పార్టీలకు ఉంది. ఇవాళ చంద్రబాబు, పవన్‌ మరోసారి సమావేశం కాబోతున్నారు. పొత్తుల విషయంపై చర్చించబోతున్నారు. బీజేపీకి ఎస్‌ చెబుతారా? నో అంటారా? అన్నది సమావేశం అవుట్‌కమ్‌లో తేలుతుంది.

Updated On 12 Feb 2024 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story