ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుది విలక్షణ వ్యక్తిత్వం. ఉండి నియోజకవర్గం టికెట్ కోసం ఆయన చాలానే కష్టపడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అన్యమనస్కంగానే రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చింది.

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుది విలక్షణ వ్యక్తిత్వం. ఉండి నియోజకవర్గం టికెట్ కోసం ఆయన చాలానే కష్టపడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అన్యమనస్కంగానే రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చింది. మంచి మెజారిటీతోనే ఆయన గెలిచారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఆయనది భిన్నమైన శైలి.రాజకీయ పార్టీల నిబంధనలు, సిద్ధాంతాలు, షరతులు ఆయనకు ఓ పట్టాన నచ్చవు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అధినాయకుడు ఏం చెబితే అది పాటించే స్వభావం కాదాయనది! జాతీయ పార్టీలలో అంటే స్వేచ్ఛగా ఉండటం కుదురుతుంది కానీ ప్రాంతీయపార్టీలలో అది చెల్లదు. ఆయన మనస్తత్వానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెట్టవ్వలేదు. వైఎస్‌ జగన్ చెప్పినట్టుగా నడుచుకోవడం రఘురామ కృష్ణరాజు వల్ల కాలేదు. అందుకే ఆ పార్టీకి దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ విషయాలన్నిఅందరికీ తెలిసినవే! అయితే సోమవారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలలో రఘురామ కృష్ణరాజు చేసిన పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బద్ధశత్రువుగా భావించే జగన్మోహన్‌రెడ్డితో ఆప్యాయంగా ముచ్చటించడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. వైసీపీ శిబిరం కంటే టీడీపీ శిబిరంలోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జగన్‌ను రఘురామ ఎందుకు కలిసి ఉంటారనేదానిపై తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. అయితే బలమైన కారణం లేనిదే రఘురామ కృష్ణరాజు ఇలా చేయరు. ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై రఘురామ కృష్ణరాజు కూసింత అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. కూటమి గెలిచిన తర్వాత ఆయన స్పీకర్‌ పదవిని ఆశించారు. అది ఇవ్వలేదు. పోనీ ఏదైనా మంత్రి పదవి ఇస్తారేమోనని అనుకున్నారు. అది కూడా జరగలేదు. క్షత్రియ సామాజికవర్గంపై చంద్రబాబుకు ఉన్న కోపం కారణంగానే తనకు పదవులు ఇవ్వలేదని, కమ్మవాడినై ఉంటే ఈ పాటికి తాను కోరుకున్న పదవి వచ్చి ఉండేదని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యనించిన విషయం గుర్తుండే ఉంటుంది. తన అసంతృప్తిని సోమవారం అసెంబ్లీలో పరోక్షంగా బయటపెట్టారు. జగన్‌ను పలకరించడం వెనుక ఉద్దేశం ఇదేనని టీడీపీ భావన! మొన్నటి వరకు జగన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకొచ్చారు ట్రిపులార్‌! కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జగన్‌పై కేసు కూడా పెట్టారు. అలాంటిది జగన్‌ను ఆత్మీయంగా పలకరించడాన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story