YS Sharmila : వై.ఎస్. షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏమిటి?
వై.ఎస్.షర్మిల(YS Sharmila) నిలకడలేని మనిషని, మాట మీద నిలబడలేని మనిషని ఈపాటికే తెలుగు ప్రజలకు అర్థమయ్యి ఉండాలి. రెండేళ్ల నుంచి ఆమె ఎన్ని మాటలు మార్చారో మనం విన్నాం. తెలంగాణ(Telangana)లో బిచాణా ఎత్తేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు.
వై.ఎస్.షర్మిల(YS Sharmila) నిలకడలేని మనిషని, మాట మీద నిలబడలేని మనిషని ఈపాటికే తెలుగు ప్రజలకు అర్థమయ్యి ఉండాలి. రెండేళ్ల నుంచి ఆమె ఎన్ని మాటలు మార్చారో మనం విన్నాం. తెలంగాణ(Telangana)లో బిచాణా ఎత్తేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఒక్క శాతం ఓట్లను పెంచినా తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారేమోనన్న ఆశతో చాలానే కష్టపడ్డారు. అదేమిటీ కడప(Kadapa) లోక్‌సభ స్థానం నుంచి షర్మిల గెలవలేరా అని మాత్రం అడగకండి. ఎందుకంటే ఆమెకు కూడా ఆ ఆశలు లేవు. తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్తలో కేసీఆర్(KCR) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్(YSR) ఆశయాలను తాను నెరవేరుస్తానన్నారు. తెలంగాణలోనే తాను పుట్టానని, ఇక్కడ్నుంచి వెళ్లే ప్రసక్తేలేదన్నారు. ఖమ్మం జిల్లా(Khammam District) పాలేరు(Paleru) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ అక్కడి మట్టి మీద ప్రమాణం చేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తానని ప్రగల్బాలు పలికారు. ఎన్నికలు దగ్గరపడే సరికి చేతులెత్తేశారు. తనను నమ్ముకుని వచ్చిన వారిని నట్టేట ముంచేసి పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జంపయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అయ్యారు. కాంగ్రెస్‌లో ఉంటూనే అక్కడ చంద్రబాబునాయుడు(Chandrababu) అండ్ కోతో చేతులు కలిపారు. వై.ఎస్.జగన్(YS Jagan)పై పనికిమాలిన విమర్శలన్నీ చేశారు. జనం నవ్వుకుంటారన్న సోయి కూడా లేకుండా చిత్రవిచిత్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. చేయడానికి ఏమీ లేదు. అందుకే ట్విట్టర్‌లో విరుచుకుపడుతున్నారు. మళ్లీ జగన్‌పై పాడిన పాటనే పాడారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందట! షర్మిల చేసిన తాజా ఆరోపణ ఇది. పైగా లండన్ వీధుల్లో విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు అంటూ నిందలేశారు. అసలు ఇప్పుడా మాట షర్మిల ఎందుకు అన్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సందర్భం కూడా లేదు. సమయ సందర్భాలతో ఆమెకు ప్రమేయం లేదు. జగన్‌ను తిట్టాలి అంతే! అన్నట్టు జగన్ లండన్‌లో ఉన్నమాట వాస్తవమే. జగన్‌ను ఓడించడానికి చేతులు కలిపిన చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan), షర్మిల(YS Sharmila) .. ఇలా అందరూ అమెరికా(America)లోనే ఉన్నారు. తానేమో అమెరికాలో రౌండ్లు కొట్టవచ్చు, జగన్ లండన్‌కు(Jagan London Tour) వెళితే మాత్రం తప్పు. కొసమెరుపు ఏమిటంటే అన్న జగన్‌ను ఓడించడం కష్టమని తెలుసుకున్న తర్వాత రాజీకి వస్తేనే బెటరనే భావనకు షర్మిల వచ్చారట! అందుకే అమెరికాకు వెళ్లారట! ఇలాగని ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమేమిటో కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.