ఎట్టకేలకు కూటమి మేనిఫెస్టో(TDP Janasena BJP Manifesto) విడుదలయ్యింది. మేనిఫెస్టోను బీజేపీ తాకను కూడా తాకలేదు కాబట్టి అది కూటమి మేనిఫెస్టో అని అనడానికి లేదు. ఆ విషయం అలా ఉంచితే మేనిఫెస్టో విడుదల అనుకున్న సమయాని కంటే నాలుగు గంటల ఆలస్య జరిగింది.

ఎట్టకేలకు కూటమి మేనిఫెస్టో(TDP Janasena BJP Manifesto) విడుదలయ్యింది. మేనిఫెస్టోను బీజేపీ తాకను కూడా తాకలేదు కాబట్టి అది కూటమి మేనిఫెస్టో అని అనడానికి లేదు. ఆ విషయం అలా ఉంచితే మేనిఫెస్టో విడుదల అనుకున్న సమయాని కంటే నాలుగు గంటల ఆలస్య జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టోను చంద్రబాబునాయుడు(Chandrababu) నివాసంలో విడుదల చేస్తారని ఓ రోజు ముందే మీడియాకు చెప్పారు. కూటమి చెప్పిన తర్వాత ఆలస్యం అవుతుందని ఎలా అనుకుంటారు? అందుకే మీడియాతో పాటు జనం కూడా 11 గంటల నుంచే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నారు. 12 గంటలు అయ్యింది. నేతలెవ్వరూ కానరాలేదు. ఒంటి గంట అయ్యింది. చంద్రబాబు(Chandrababu), పవన్‌(Pawan Kalyan) జాడలేదు. రెండయ్యింది.. సేమ్‌ సీన్‌! ఎదురు చూసేవారికి ఓపిక నశించింది. మీడియాకు కూడా అంతే! విడుదలైనప్పుడు చూద్దాంలే అని మిగతా పనుల్లో పడిపోయింది మీడియా! మొత్తం మీద నాలుగు గంటల ఆలస్యంతో మేనిఫెస్టో విడుదలయ్యింది. టీడీపీ అనుకూల మీడియా ప్రత్యక్ష ప్రసారం చేశాయి కానీ మిగతా ఛానెళ్లు లైట్‌ తీసుకున్నాయి. చెప్పిన టైమ్‌కు రిలీజ్‌ అయి ఉంటే అన్ని ఛానెళ్లు లైవ్‌ పెట్టేవేమో! అద్సరేకానీ నాలుగు గంటలపాటు ఆలస్యం ఎందుకయ్యింది? చాలా మంది క్యూరియాసిటీ ఇదే! ఏం జరిగి ఉంటుందోనని ఆరా తీశారు కొందరు. ఈ నాలుగు గంటల సమయంలో చాలా జరిగిందట! మేనిఫెస్టో విడుదలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద ఫోటోను ఫ్లెక్సీలో పెట్టారట! అయితే మేనిఫెస్టోలో భాగస్వామ్యం లేని తమను తెరపైకి ఎందుకు తెస్తున్నారంటూ చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లను బీజేపీ అధినాయకత్వం పెద్ద క్లాస్‌ తీసుకున్నదట! మీడియా కాన్ఫరెన్స్‌లో ఉపయోగించే ఫ్లెక్సీలో మోదీ ఫోటో పెట్టకూడదని హెచ్చరించారట! అలాగే మేనిఫెస్టో విడుదలకు తాము వచ్చేది లేదని చంద్రబాబు, పవన్‌కు గట్టిగానే చెప్పారట! చంద్రబాబు, పవన్‌ దెబ్బకు బిత్తరపోయారట! బెదిరిపోయారు కూడానట! అసలే తమ మేనిఫెస్టోను జనం నమ్మడం మానేశారని, ఇప్పుడు మీరు కూడా రాకపోతే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతుందని బీజేపీ పెద్దలను బతిమాలుకున్నారట! కుదరదుగాక కుదరదని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టం చేసిందని సమాచారం! మేనిఫెస్ట్‌కు కర్త కర్మ క్రియ మీరేనని, తమ బాధ్యత ఉండదని బీజేపీ అనడంతో చంద్రబాబు, పవన్‌లు బిక్క మొహాలేసుకున్నారట! ఎవర్నో ఒకర్ని పంపండి ప్లీజ్‌ అని ప్రాధేయపడటంతో బీజేపీ పెద్దలకు జాలి కలిగిందట! బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ వస్తారని చెప్పడంతో కాసింత ఊపిరి పీల్చుకుని మేనిఫెస్టో విడుదలకు సిద్ధమయ్యారు బాబు, పవన్‌!
సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌ అయితే వచ్చారు కానీ మేనిఫెస్టో ప్రతిని ఆయన ముట్టుకోను కూడా ముట్టుకోలేదు.

Updated On 1 May 2024 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story