స్కిల్ స్కాం కేసు(Skill Development Scam Case)లో అరెస్టయ్యి దాదాపు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు(Chandrababu) మధ్యంతర బెయిల్(interim bail)పై విడుదలయ్యారు. దాదాపు 28 రోజులు చంద్రబాబు బయటనే ఉండనున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది.
జైలు నుంచి బయటకు వచ్చాక వ్యూహాలకు పదును పెడుతున్నారా..?
ఎన్నికల రోడ్ మ్యాప్‌కు స్కెచ్ వేస్తున్నారా..?
మేనిఫెస్టోపై కసరత్తులు మొదలెట్టారా..?
పవన్‌తో కలిసి ఏం ప్లాన్ గీస్తున్నారు..?
స్కిల్ స్కాం కేసు(Skill Development Scam Case)లో అరెస్టయ్యి దాదాపు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు(Chandrababu) మధ్యంతర బెయిల్(interim bail)పై విడుదలయ్యారు. దాదాపు 28 రోజులు చంద్రబాబు బయటనే ఉండనున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో తన కంటికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇంత వరకు బానే ఉంది.. ఆ తర్వాత చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? ఎలాంటి వ్యూహాలు పన్ననున్నారు..? తాను జైలులో ఉండగానే జనసేనతో పొత్తు ఖరారు కావడంతో.. పవన్‌తో కలిసి ఎలాంటి ప్లాన్‌లు చేయబోతున్నారోనన్న ఆసక్తి నెలకొంది.
ఎన్నికలకు గట్టిగా 160 రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పావులు కదుపుతున్నాయి. పవన్, పార్టీ నేతలు కుటుంబసభ్యులతో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు రూపొందిస్తారని తెలుస్తోంది. మహానాడులో ప్రకటించిన ఆరు హామీలకు తోడుగా జనసేనాని ప్రతిపాదించిన నాలుగు హామీలను మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. భవన నిర్మాణ కార్మికులు, యువత, రైతులు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల వినియోగానికి సంబంధించిన నాలుగు అంశాలను కలపాలని పవన్ కోరారు. మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్ది ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల రూట్ మ్యాప్ కూడా చంద్రబాబు ఖరారు చేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సవ్యంగా సాగేలా ప్రణాళికను చంద్రబాబు రచిస్తారని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా బాగా పనిచేసిందని.. అందుకు దీటుగా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను బాగా వాడుకోలని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. ఐక్య కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తే వైసీపీని ఎదుర్కోవడం పెద్ద సాధ్యం కాదని చంద్రబాబు అనుకుంటున్నారట.
బీజేపీతో ఏ మేరకు కలిసి వస్తుందోనని చంద్రబాబు ఆరా తీశారట. ఇప్పటికే తాను ఎన్డీఏలోనే ఉన్నానని.. జనసేన-టీడీపీ కూటమిలోకి బీజేపీ వస్తుందన్న ఆశ తనకు ఉందంటున్నారు పవన్ కల్యాణ్. అయితే వైసీపీకి బీజేపీ అండదండలున్నాయని, బీజేపీని కలుపుకుంటే పెద్దగా లాభం చేకూరదని ఒకరిద్దరు టీడీపీ నేతలు చంద్రబాబుతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జనసేనలోనూ కొందరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారట. బీజేపీపై చంద్రబాబు వైఖరేంటో రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.