ఏపీ విపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లతో ఢిల్లీలో బీజేపీ హైకమాండ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలను ఎప్పటికప్పుడు తప్పు బట్టే నేతల్లో వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ఒకరు. జనసేనాని తీసుకుంటున్న నిర్ణయాలపై అంబటి విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. మరోసారి ఆయన సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారని మనకు స్పష్టంగా తెలుస్తోంది.

"సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా.. సీఎం అంటే ఛీఫ్ మినిస్టరా ?, సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా ? సీఎం అంటే చంద్రబాబు మనిషా?, సీఎం అంటే చీటింగ్ మనిషా?" అని అంబటి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్తా వైరల్ అవుతోంది.

ఏపీ విపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లతో ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ చర్చలు జరిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై ఓ ప్రకటన చేశారు. ఎన్డీయే కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు నడ్డా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, అద్భుత నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకెళతాయని తెలిపారు.

Updated On 9 March 2024 11:00 PM GMT
Yagnik

Yagnik

Next Story