సినీ నటి, మాజీ మంత్రి రోజాకు(Rk Roja) ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి.

సినీ నటి, మాజీ మంత్రి రోజాకు(Rk Roja) ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSRCP)అధికారం కోల్పోయినప్పటి నుంచి రోజాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి(Mega star Chiranjeevi) నుంచి మొదలుపెడితే బాలకృష్ణ(BalaKrishna),నాగార్జున(Nagarjuna),వెంకటేశ్‌(Venkatesh) వంటి టాప్‌ హీరోలతో నటించారు రోజా. తర్వాత మారుతున్న కాలంతో పాటు తన వయసుకు తగిన పాత్రలు వేశారు. బుల్లితెరలో అడుగుపెట్టి అక్కడా రాణించారు. నిజానికి రోజాకు పునర్జీవితాన్ని ప్రసాదించింది టెలివిజన్‌ రంగమే! 2019లో ఎమ్మల్యే (MLA)అయినప్పటి నుంచి రోజాకు ఫ్యాన్స్‌ తగ్గడం మొదలయ్యింది. రోజా నోటి దురుసు కూడా కారణమనే చెప్పాలి. ప్రముఖ హీరోలను ఉద్దేశించి కూడా రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలా ఆ నటుల అభిమానానికి కూడా దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో రోజా ఓటమిపాలయ్యారు. ఆ ఓటమి తర్వాత రోజా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత వైభవం తుడిచిపెట్టుకుపోయింది. సినిమాలు చెద్దామంటే ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. టెలివిజన్‌(Telivision) రంగంలో కూడా అంతే! ఇక్కడ ఛాన్సులు దొరకవని తేలిన తర్వాత ఆమె తమిళనాడులో ప్రయత్నాలు చేశారు. అక్కడైనా ఏదో ఒక టెలివిజన్‌ షో అయినా దొరక్కపోదా అన్న ఆశతో రోజా ఉన్నారు. అయితే అక్కడ నుంచి సరైన రియాక్షన్‌ రాలేదు. జబర్దస్త్‌(Jabardasth)కు మళ్లీ వద్దమనుకుంటే మల్లెమాల(Mallemala) సంస్థ నిర్మోహమాటంగా వద్దని చెప్పేసిందట! మొత్తం మీద రోజా పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా తయారయ్యిందట!

ehatv

ehatv

Next Story