Janasena Pawan Kalyan : పవన్ ఎందుకిలా.. ప్రశ్నించే వాడి చుట్టూరా ఇన్ని ప్రశ్నలా..?
ఇటీవల పొత్తులపై పవన్ ఓపెన్ అయిపోయారు... గజమాలలు వేసి.. సీఎం, సీఎం అని అరిస్తే తాను సీఎం కానని.. కనీసం సీఎం అవ్వడానికి తగిన ఓట్ బ్యాంకు కూడా మనకు లేదని పవన్ తేల్చి చెప్పారు.. కష్టపడి పని చేస్తే సీఎం పదవి అదే వస్తుందని జనసైనికులకు ఆయన వేమన సూక్తులు చెప్పారు.
భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది.. ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బ్రతికిస్తుంది. ఇది సినిమా డైలాగ్ కావొచ్చు కానీ పవన్ కళ్యాణ్ కు ఇది కరెక్ట్ గా సూట్ అవుతుంది.. మొన్నటిదాకా జనసేన అధికారం సాధిస్తుంది.. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అన్న పవన్ మాటకు ఒక్క సారిగా తెరపడింది.. పార్టీ సభల్లో ఆయన చెప్పే పంచ్ డైలాగులకు.. ఆయన వేసే కేకలు అభిమానులకు ఇక ఉత్సహం రాకపోవచ్చు.. దానికి కారణం ఏంటి అంటే. ఆయన తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలే.
ఇటీవల పొత్తులపై పవన్ ఓపెన్ అయిపోయారు... గజమాలలు వేసి.. సీఎం, సీఎం అని అరిస్తే తాను సీఎం కానని.. కనీసం సీఎం అవ్వడానికి తగిన ఓట్ బ్యాంకు కూడా మనకు లేదని పవన్ తేల్చి చెప్పారు.. కష్టపడి పని చేస్తే సీఎం పదవి అదే వస్తుందని జనసైనికులకు ఆయన వేమన సూక్తులు చెప్పారు.
సరే ఆయన అన్నట్టే అనుకుందాం... ఒక్కసారి గత ఎన్నికల లెక్కలు చూద్దాం.. 2019 ఎన్నికల్లో జగన్ 151 స్థానాల్లో ఎవరు ఊహించని విజయాన్ని అందుకున్నారు.. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి ఎందుకంటే.. టీడీపీ ఓట్ బ్యాంకును పవన్ దారుణంగా చీల్చారు ఎంతలా అంటే దాదాపు 60కి పైగా నియోజక వర్గాల్లో జనసేన వల్లే టీడీపీ ఓడిందనడంలో అతిశయోక్తి లేదు.. జనసేనకు గత ఎన్నికల్లో 7 % ఓట్లు నమోదయ్యాయి. ఇప్పుడు అది దాదాపు 16 నుంచి 18 శాతానికి పెరిగిందని స్వయానా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.. అంటే జనసేన బలం పెరిగింది..
ప్రస్తుత పరిస్థితిలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశం లేదు.. కచ్చితంగా పవన్ సపోర్ట్ టీడీపీకి అవసరం జగన్ పై ఉన్న వ్యతిరేకత, బాబు పవన్ కలయిక.. ఇవన్నీ చూస్తే వీరు మళ్లీ అధికారం సాధించే అవకాశం లేకపోలేదు.. కానీ ఒక్క విషయం.. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలనీ జనసైనికులు ఆశిస్తుంటే పవన్ మాత్రం నేను ముఖ్యమంత్రిని కాలేను.. అది కాలమే నిర్ణయయించాలని చెప్పుకొస్తున్నారు.. ఇలాంటి తరుణంలో జనసైనికులు పవన్ మాటవిని టీడీపీకి ఓటు వేస్తారా..? మళ్లీ చంద్రబాబుని అధికారంలో కూర్చోబెడతారా..?
గెలవాలనే తాపత్రయం అందరికి ఉంటుంది.. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని.. ప్రతీ రాయిని పునాదిగా మలచి దానిపై సింహాసనాన్ని నిర్మించుకునే వాడే అసలైన రాజు.. యుద్దానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారు.. యాత్ర కోసం వారాహి ఎదురుచూస్తుంది.. ఇలాంటి తరుణంలో పవన్ రాజకీయ కురుక్షేత్రంలో నిలబడి విజయం సాధిస్తారా.. లేఖ సంధి చేసుకొని యుద్దాన్ని ముగిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.