జీవీ రెడ్డి రాజీనామా వెనుక ఏం జరిగింది..!

కూటమి సర్కార్‌లో ఏం జరుగుతోంది. కూటమి సర్కార్‌లో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు తెలుగుదేశం పార్టీ వాయిస్‌ను చాలా బలంగా ఆయన వినిపించారు. టీడీపీకి చెందిన మీడియా హౌసెస్‌లో టీడీపీ వాయిస్‌ను వినిపిస్తూ వచ్చారు. నారా లోకేష్‌కు కూడా జీవీరెడ్డి అత్యంత సన్నిహతంగా ఉన్నారు. నారా లోకేష్ పర్టికులర్‌గా జీవీరెడ్డిని ఫైబర్‌నెట్ చైర్మన్‌గా ఉండాలని నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీ ఫైబర్‌నెట్ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ఫైబర్‌నెట్ డబ్బులు రాంగోపాల్‌వర్మ వ్యూహం సినిమాకు మళ్లించారని కేసులు పెట్టారు. ఫైబర్‌నెట్‌లో నిధుల మళ్లింపుపై క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్లు ఉంటే వారికో కుర్చీ, ప్రొటోకాల్, వాహన వసతులు వచ్చిన తర్వాత సైలెంట్‌గా తమ కార్యకలాపాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ జీవీరెడ్డి అలా కాకుండా ఫైబర్‌నెట్‌లో జరిగిన ఆర్థిక కార్యకలాపాలను సునిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు చేశారు. ఐఏఎస్ అధికారులు ఫైబర్‌నెట్‌కు నష్టం కలిగించేలా చేస్తున్నారని ఆరోపించారు. ఫైబర్‌నెట్ ఎండీపై ఏకంగా రాజద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. ఎండీ నిర్వాకం వల్ల ఫైబర్‌నెట్‌కు రూ.350 కోట్ల పరిహారం కట్టాల్సిన అవసరం ఏర్పడిందాన్నారు జీవీరెడ్డి. అయితే జీవీరెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
