Jr NTR : ఎన్టీఆర్‌కు కాకుండా పోయిన తెలుగుదేశం పార్టీ!
చంద్రబాబునాయుడు(Chandrababu) సారథ్యంలోని తెలుగుదేశంపార్టీతో(TDP) నందమూరి హరికృష్ణ(Hari Krishna) కుటుంబానికి ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయా. తెగిపోయేలా చంద్రబాబే(Chandrababu) చేశారు. అవసరార్థం హరికృష్ణ కూతురు సుహాసినిని(Suhasini) కూకట్‌పల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు కానీ లేకపోతే ఆమెను కూడా పట్టించుకునేవారు కాదు. 2018 ఎన్నికల తర్వాత ఆమె ముచ్చటే వినిపించడం లేదు.
చంద్రబాబునాయుడు(Chandrababu) సారథ్యంలోని తెలుగుదేశంపార్టీతో(TDP) నందమూరి హరికృష్ణ(Hari Krishna) కుటుంబానికి ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయా. తెగిపోయేలా చంద్రబాబే(Chandrababu) చేశారు. అవసరార్థం హరికృష్ణ కూతురు సుహాసినిని(Suhasini) కూకట్‌పల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు కానీ లేకపోతే ఆమెను కూడా పట్టించుకునేవారు కాదు. 2018 ఎన్నికల తర్వాత ఆమె ముచ్చటే వినిపించడం లేదు. అంటే ఆమెతో పని అయిపోయిందనుకున్నారు చంద్రబాబు. ఇక ఇవాళ ఎన్.టి.రామారావు వర్ధంతి సందర్భంలో ఎన్టీఆర్ ఘాట్‌లో(NTR Ghat) జరిగిన సన్నివేశాలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌ను(Jr NTR) ఎట్టిపరిస్థితుల్లోనూ దరి చేర్చుకోరని అర్థమయ్యింది. తారక్‌ను దూరం పెట్టడానికి ఏకైక కారణం నారా లోకేశే(Nara Lokesh)! ఎన్టీఆర్ వస్తే తన కొడుకు భవిష్యత్తు ఏమవుతుందోనని చంద్రబాబుకు భయం! తన అల్లుడు ఎటూ కాకుండా పోతాడేమోనని బాలకృష్ణకు భయం! లోకేశ్ ఉండగా ఎన్టీఆర్‌కు అక్కడ స్థానం ఉండదన్న విషయం చంద్రబాబు రాజకీయాలు తెలిసినవారికే కాదు, మామూలు వారికి కూడా తెలుసు! ఈ గొడవంతా ఎందుకని ఎన్టీఆరే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినా సరే అప్పుడప్పుడు ఎన్టీఆర్‌ను కెలుతుకుంటారు. తారక్‌పై లేనిపోనివి చెబుతూ సోషల్ మీడియాలో(Social media) వైరల్ చేస్తుంటారు. ఆ మధ్యన సీఎం జగన్‌ను(CM Jagan) ఎన్టీఆర్ కలిశారని, నోవాటెల్ హోటల్‌లో ఇద్దరి మధ్య మంతనాలు జరిగాయని పుకార్లు పుట్టించారు. సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చారు. టీడీపీ శ్రేణులలో ఇది నిజమే కాబోలన్న భ్రమలు కల్పించారు. టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ మంత్రిగా పని చేశారు.
ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లకపోతే బాగుండదని కల్యాణ్‌రామ్(Kalyan Ram) వెళ్లారు. వెళ్లిన కల్యాణ్‌రామ్‌ను అక్కడెవ్వరూ పట్టించుకోలేదు. పలకరించిన పాపాన పోలేదు. ఇక అప్పట్నుంచి కల్యాణ్ కూడా అటువైపు వెళ్లడం మానేశారు. బాలకృష్ణకు కూడా సొంత అన్న పిల్లల మీద అంత మమకారమేమిలేదు. వారి కంటే ఆయనకు అల్లుడే ఎక్కువ! ఎంతైనా బిడ్డ మొగుడు కదా! ఆ మాత్రం ఉంటుంది లేండి! ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ కార్యక్రమానికి హీరోలందరూ వెళ్లారు. ఒక్క ఎన్టీఆర్ తప్ప. అంటే ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్‌ను పిలవలేదు. పాపం సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచి ఎన్టీఆర్ ఇలాంటి అవమానాలను ఎన్నింటినో భరించాడు. ఎన్నింటినో సహించాడు. అయినా ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. బాధను అదిమిపెట్టుకున్నాడే కానీ బయటకు ప్రదర్శించలేదు. గుండెల్లో ఇంత ఆవేదన ఉన్నప్పుడు తెలుగుదేశంపార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడుకి కానీ ఏమైనా అయితే ఎందుకు పట్టించుకుంటాడు? చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ ఎందుకు రియాక్టవ్వలేదని టీడీపీవాళ్లు అడుగుతుంటారు. నిజానికి వారికి అలా అడిగే హక్కు లేదు. టీడీపీలోని కమ్మ సామాజికవర్గం ఎన్టీఆర్‌ను ఏనాడో దూరం పెట్టేసింది. తారక్ తమవాడు కానేకాదంటారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటేనే బాలకృష్ణ సహించలేకపోయాడు. వెంటనే తీసేయమని కరుకుగా చెప్పాడు. అంటే ఎన్టీఆర్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్ ఫెక్సీలు, కటౌట్లు ఉంటే బాలయ్యకు వచ్చిన ఇబ్బందేమిటో తెలియదు. ఎంతకాదనుకున్నా తారక్ ఎన్టీఆర్‌కు మనవడు. హరికృష్ణ కొడుకు. ఆయనలో ప్రవహిస్తున్నది కూడా ఎన్టీఆర్ రక్తమే! ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడానికి నందమూరి కుటుంబానికి ఎంత హక్కు ఉందో తారక్‌కు కూడా అంతే ఉంటుంది. ఆ సంగతి వదిలేస్తే ఇప్పుడు కరడుగట్టిన పెద్ద ఎన్టీఆర్ అభిమానులు ఏవైపున ఉంటారు? తారక్‌వైపా? లేక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీవైపా?