YS Sharmila- CM Jagan : అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు సృష్టించిందెవరు?
రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారు.. కుటుంబాలను చీలుస్తారు. రాజకీయాలు చేస్తారు.. ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM Jagan) నోటి వెంట వచ్చాయి. కాకినాడలో జరిగిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్యామీలిని ఎవరు చీలుస్తున్నారన్నది పక్కడ పెడితే జగన్ ఈ మాట అనగానే అందరి ఫోకస్ ఆటోమాటిక్‌గా వై.ఎస్. షర్మిలపై(YS sharmila) పడింది. ఆమెనే కదా అన్నతో విభేదించి, అన్న ఓటమి కోసం ప్రయత్నిస్తున్నది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నానుడి ఉంది కదా! అందుకే తెలుగుదేశం పార్టీ(TDP) అను'కుల' మీడియా అంతా షర్మిలకు ప్రయార్టీ ఇవ్వడం మొదలు పెట్టాయి. ఎలాగైనా సరే షర్మిలను అడ్డం పెట్టుకుని జగన్ అంతుచూడాలనుకుంటున్నాయి.
రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారు.. కుటుంబాలను చీలుస్తారు. రాజకీయాలు చేస్తారు.. ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM Jagan) నోటి వెంట వచ్చాయి. కాకినాడలో జరిగిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్యామీలిని ఎవరు చీలుస్తున్నారన్నది పక్కడ పెడితే జగన్ ఈ మాట అనగానే అందరి ఫోకస్ ఆటోమాటిక్‌గా వై.ఎస్. షర్మిలపై(YS sharmila) పడింది. ఆమెనే కదా అన్నతో విభేదించి, అన్న ఓటమి కోసం ప్రయత్నిస్తున్నది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నానుడి ఉంది కదా! అందుకే తెలుగుదేశం పార్టీ(TDP) అను'కుల' మీడియా అంతా షర్మిలకు ప్రయార్టీ ఇవ్వడం మొదలు పెట్టాయి. ఎలాగైనా సరే షర్మిలను అడ్డం పెట్టుకుని జగన్ అంతుచూడాలనుకుంటున్నాయి. జగన్ ప్రతిష్టను దిగజార్చడానికి కంకణం కట్టుకున్నాయి. సొంత చెల్లెలునే సరిగ్గా చూడని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఎలా చూస్తారని అప్పుడే రాళ్లు వేయడం మొదలు పెట్టాయి.
అన్నట్టు తెలుగుదేశంపార్టీకి కూడా ఇప్పుడు షర్మిల కావాల్సిన వ్యక్తి. ఇంతకీ అన్నాచెల్లెళ్ల మధ్య అంతటి అగాధం ఏర్పడటానికి కారణమేమిటి? ఆస్తులేనా? అంతకు మించినది ఏమైనా ఉందా? బ్రదర్ అనిల్‌కుమార్(Brother Anil Kumar) కారణంగానే జగన్-షర్మిల మధ్య విభేదాలు మొదలయ్యాయని కొందరు అంటుంటారు. అబ్బే కుటుంబంలో వై.ఎస్.భారతి(YS Bharati) ఆధిపత్యం నచ్చకే షర్మిల బయటకు వచ్చారంటారు ఇంకొందరు. ఆస్తిపాస్తులలో సమానవాట దక్కలేదు కాబట్టే షర్మిల అన్నతో గొడవపడ్డారని మరికొందరు చెబుతుంటారు. రాజకీయంగా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని షర్మిల అలిగారని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి.
కారణం ఏమైతేనేమీ జగన్- షర్మిల మధ్య పూడ్చలేని అంతరం ఏర్పడింది. తన కొడుకు పెళ్లికి అన్నను పిలవకపోతే బాగుండదు కాబట్టి షర్మిల బుధవారం జగన్‌ను కలిశారే కానీ, అనురాగం-ఆప్యాయతలతో కాదన్నది వాస్తవం! ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేసరికి ఓ వర్గం మీడియా కుటుంబం నిట్టనిలువునా చీలిపోయిందని కథనాలు రాస్తున్నాయి. ఓ కుటుంబంలో అన్నా చెల్లెళ్లు వేరేవేరే పార్టీలో ఉండటం ఇదేమీ మొదటిసారి కాదే! ఆ మాటకొస్తే తల్లీ కొడుకులు, భార్య భర్తలు, తండ్రి కొడుకులు కూడా భిన్నమైనా పార్టీలలో కొనసాగిన ఉదంతాలు లేవా? ఆస్తుల కోసం వేరుపడిన కుటుంబాలు లేవా? ఎన్.టి.రామారావు(Sr NTR) తెలుగుదేశంపార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబునాయుడు ఏ పార్టీలో ఉన్నారు?
కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు మామకు సవాల్ విసరలేదా? అధిష్టానం ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధమేనంటూ ప్రగల్బాలు కూడా పలికారు చంద్రబాబు(Chandrababu). చంద్రగిరిలో ఓడిపోయిన మూడు నెలలకే మామగారి ప్రాపకం కోసం శతవిధాల ప్రయత్నించారు. భార్య భువనేశ్వరిని(Bhuvaneswari) అడ్డం పెట్టుకుని టీడీపీలో చేరిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు. పార్టీలో చేరిన రెండు దశాబ్దాల తర్వాత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటి పొడిచి పరోక్షంగా ఆయన మరణానికి కారణమైన విషయాన్ని తెలుగువారు అంత ఈజీగా మర్చిపోలేరు. అప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో చీలిక రాలేదా? అక్కడి వరకు ఎందుకు బావ చంద్రబాబుతో గొడవపడి నందమూరి హరికృష్ణ(Nandhamuri Harikrishna) కొత్తగా పార్టీ పెట్టుకున్నారు కదా!
పురంధేశ్వరి మాత్రం తెలుగుదేశంలో ఉన్నారా ఏమిటి? ఆమె పదవిలో ఉన్నంతకాలం కాంగ్రెస్‌లోనే కదా ఉండింది? ఇప్పుడు కూడా ఆమె బీజేపీలో ఉన్నారు తప్ప ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో లేరు. కుటుంబంలో చీలికలు అని రాస్తున్న ఈనాడు మరి రామోజీరావును విభేదించి కొడుకు సుమన్ బయటకు వెళ్లిన సంగతిని ఎందుకు విస్మరించింది? అశోక్ గజపతి, ఆనంద్ గజపతి వేర్వేరు పార్టీలో ఉన్నారు కదా! చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు కూడా అన్నతో విభేదించి వేరే పార్టీలోనే కదా ఉన్నది? ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణ- అబ్బాయి ఎన్టీఆర్ మధ్య ఎంతటి సఖ్యత ఉన్నదో అందరికీ తెలుసు! విజయరాజే సింధియా బీజేపీలో ఉంటే ఆమె కుమారుడు మాధవరావు సింధియా కాంగ్రెస్‌లో ఉన్నారు కదా!ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవు.
ఇప్పుడు జగన్-షర్మిలపై మీడియా అంత ఫోకస్ ఎందుకు చేస్తున్నదంటే మరో మూడునాలుగు నెలలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి!అన్నపై చెల్లెలి పోరాటం తమకు మేలు చేస్తుందని టీడీపీ సంబరపడుతుంది. ఆ పార్టీ అనుకూల మీడియా కూడా వార్తలు వండివారుస్తోంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా అన్నాచెల్లెళ్లు కలవకమానరు. రక్తసంబంధీకుల మధ్య శాశ్వత శత్రుత్వం ఉండదు.