Posani Quits Politics : పోసాని హఠాత్ నిర్ణయానికి జగనే కారణమా?
సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి(Posani krishna Murali) రాజకీయాల నుంచి వైదొలిగారు.
సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి(Posani krishna Murali) రాజకీయాల నుంచి వైదొలిగారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) కూడా రాజీనామా(Resign) చేశారు. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడటనని, ఏ పార్టీని విమర్శించనని మాట ఇచ్చారు. ఇంత హఠాత్తుగా ఆయన ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్టు? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలపై, సానుభూతి పరులపై కూటమి సర్కారు పెడుతున్న కేసులకు భయపడ్డారా?(Police case fear) కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి(Family Pressure) వస్తున్నదా? పోసానిపై పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. వాటి నుంచి బయటపడటానికే పోసాని ఈ పని చేశారా? ఏమోగానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) వైఖరితో మనస్తాపం చెంది ఉంటారన్నది కొందరి భావన! జగన్మోహన్‌రెడ్డి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశం పాటుపడినా, ఎన్నో త్యాగాలు చేసినా కొంచెం కూడా గుర్తుంపు లేదని పోసాని ఆవేదన చెందుతున్నారని దగ్గరవాళ్లు అంటున్నారు. రెండు రోజుల కిందట వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal varma) కేసు గురించి మాట్లాడారు. వర్మపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. వర్మకు మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరి పోసాని కృష్ణమురళిపై కూడా కూటమి సర్కారు కేసులు పెట్టింది కదా! పోసాని గురించి కూడా జగన్ మట్లాడాలి కదా! పైగా రామ్‌గోపాల్ వర్మ పార్టీ మనిషి కాదు. ఆయన పార్టీ సభ్వత్వం తీసుకోలేదు. పోసాని అలా కాదు. ఆయన పార్టీ నాయకుడు. పార్టీ కోస ఆయన చాలా చేశారు. పార్టీని నమ్ముకునే ప్రత్యర్థులను చెడుగుడు ఆడారు. తను తిట్టారు. వారితో తిట్టించుకున్నారు. ఇంత చేసినా జగన్మోహన్‌రెడ్డి తనను పట్టించుకోవడం లేదన్న బాధ పోసానిలో ఉందని అంటున్నారు. అవమానంగా భావించే పార్టీ నుంచి వైదొలిగాడని చెబుతున్నారు.