Chandrababu Secret Trip : చంద్రబాబు విదేశీ పర్యటనపై గోప్యత అందుకోసమేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు(AP Elections) ముగిసిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, తెలుగుదేశంపార్టీ(TDP) అధ్యక్షుడు విదేశీ పర్యటనలకు(Vacations) వెళ్లారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) విదేశీ పర్యటనపై టీడీపీ అనుకూల మీడియా నానా రచ్చ చేసింది. జగన్ వెళ్లింది ఎక్కడికో అందరికీ తెలుసు. అదేమీ రహస్య పర్యటన కాదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు(AP Elections) ముగిసిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, తెలుగుదేశంపార్టీ(TDP) అధ్యక్షుడు విదేశీ పర్యటనలకు(Vacations) వెళ్లారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) విదేశీ పర్యటనపై టీడీపీ అనుకూల మీడియా నానా రచ్చ చేసింది. జగన్ వెళ్లింది ఎక్కడికో అందరికీ తెలుసు. అదేమీ రహస్య పర్యటన కాదు. చెప్పే వెళ్లారు. ఇంగ్లాండ్‌తో పాటు మిగతా దేశాలలో జగన్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు విడుదల అవుతూనే ఉన్నాయి. అయినా జగన్ విదేశాలకు వెళ్లడంపై టీడీపీ అనుకూల మీడియా ఇష్టం వచ్చినట్టుగా రాశాయి. అదే చంద్రబాబు(Chandrababu) పర్యటనపై మాత్రం అక్షరం ముక్క రాయడం లేదు. రాస్తే గీస్తే చంద్రబాబు పర్యటన గురించే రాయాలి. ఎందుకంటే ఆయన రహస్యంగా వెళ్లారు. కుటుంబసభ్యులతో వెళ్లిన చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. అనుకూల మీడియా వారికి మాత్రం తెలిసే ఉంటుంది. కానీ వారు మాత్రం చచ్చినా చెప్పరు. అందుకే చంద్రబాబు విదేశీ పర్యటనపై బోల్డన్నీ అనుమానాలు వస్తున్నాయి. తండ్రికొడుకులైన చంద్రబాబు, లోకేశ్‌లకు(Nara Lokesh) ఎంత ప్రచార పిచ్చి ఉందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వీరు వదలరు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది తన ఘనతేనని చెప్పుకునే చంద్రబాబు తన పర్యటన విషయాన్ని మాత్రం ఎందుకు దాచిపెడుతున్నారు. ఈ దేశానికి వెళితే ఆ దేశ అధికారులు చంద్రబాబుతో సమావేశమయ్యారని, సలహాలు సూచనలు తీసుకున్నారని అనుకూల మీడియా బాకాలు ఊదుతుంటాయి కదా! మరి ఇప్పుడెందుకు భజన చేయడం లేదు. అందుకే కొందరు బహుశా చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని, బయటకు చెప్పకూడని వ్యాధి ఏదో ఉండవచ్చని అనుకుంటున్నారు.