Weather Update: ఏపీలో ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల్లో చలికాలంలోనే ఎండలు దంచికొడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు, చలి ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో తీవ్ర దశకు చేరుకుంది. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం కొనసాగుతోంది. ఈ ఏడాది వేసవిలో తొలుత మోస్తర్ వేడి, ఆ తర్వాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాల్పులు వీస్తాయని […]
తెలుగు రాష్ట్రాల్లో చలికాలంలోనే ఎండలు దంచికొడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు, చలి ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో తీవ్ర దశకు చేరుకుంది. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం కొనసాగుతోంది. ఈ ఏడాది వేసవిలో తొలుత మోస్తర్ వేడి, ఆ తర్వాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నామంటున్నారు. ఆదివారం కర్నూలులో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. కడపలో 34.8 . అనంతపురంలో 34.5, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో 34.6, నంద్యాల 34, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 33.6, గుంటూరు జిల్లా అమరావతిలో 33.2, తిరుపతిలో 33.2, నెల్లూరు జిల్లా కావలిలో 33, కాకినాడ జిల్లా తునిలో 32.4, నెల్లూరులో 32, మచిలీపట్నంలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ఫిబ్రవరి 5న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలోని వివిక్త ప్రాంతాలలో భారీ వర్షాలు/మంచు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలకు హిమపాతం హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 24 గంటలపాటు కొన్ని ప్రాంతాలకు వెళ్లడం నివారించాలని నివాసితులను కోరారు. వాతావరణ శాఖ సూచన మేరకు మంగళవారం నుంచి కశ్మీర్‌లో వాతావరణం మెరుగుపడుతుందని అంచనా వేశారు. వాతావరణ శాఖ ప్రకారం ఫిబ్రవరి 4 నుండి 7 వరకు అరుణాచల్ ప్రదేశ్‌లో చాలా విస్తృతమైన వర్షపాతం/మంచు కురిసే అవకాశం ఉంది.