Rain In AndhraPradesh: గుడ్ న్యూస్.. వర్షాలు పడే అవకాశం
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే వాతావరణం ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో ప్రస్తుతం ఊహించని విధంగా ఎండలు వాయిస్తూ ఉండగా.. త్వరలోనే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతూ ఉన్నాయి. రోజంతా ఎండలు మండిపోతూ ఉన్నా.. సాయంత్రం సమయానికి చల్లటి గాలులు పలు ప్రాంతాల్లో వీస్తున్నాయి. త్వరలోనే వర్షాలు మరింత ఊపందుకుంటాయని అంటున్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే వాతావరణం ప్రస్తుతం ఇక్కడ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం లేకపోలేదని.. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒకట్రెండు చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతుందని అంటున్నారు. మార్చి 20న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌కు చేరువలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో 20న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని అంటున్నారు.