సూర్య ప్రతాపంతో తెలంగాణ(Telangana) ప్రజలు అల్లాడిపోతున్నారు. కనికరం లేకుండా నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా దినకరుడు కరుణించడం లేదు. పైగా రోజురోజుకూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను పెంచుతున్నాడు. మండిపోతున్న ఎండల కారణంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి.

సూర్య ప్రతాపంతో తెలంగాణ(Telangana) ప్రజలు అల్లాడిపోతున్నారు. కనికరం లేకుండా నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా దినకరుడు కరుణించడం లేదు. పైగా రోజురోజుకూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను పెంచుతున్నాడు. మండిపోతున్న ఎండల కారణంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. మరో నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రత 49కి చేరవచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. భయంకరమైన వడగాలులు వీస్తాయని, అత్యవసరమైతే తప్ప కాలు బయటపెట్టకూడదని వాతావరణశాఖతో పాటు వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం(El Nino Effect)తో తెలంగాణలో చాలా చోట్ల 46 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం 20 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌(Red Alert) జారీ చేసింది. గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. శనివారం వరకు దీర్ఘకాల వడగాలులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ చెబుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది. సోమవారం వరకు కర్ణాటక,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఉంటుందని సూచించింది.

Updated On 3 May 2024 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story