తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించినా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా వర్షాలు పడడం లేదు. ఇది రైతన్నల్లో ఆందోళనను పెంచుతోంది. తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండడంతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయన్నారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. నేడు మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్‌, నల్లగొండ, జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Eha Tv

Eha Tv

Next Story