Rain Alert: రాయలసీమకు భారీ వర్షం.. ఎన్ని రోజులంటే!!
రానున్న మూడు రోజులు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని
రానున్న మూడు రోజులు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అదే సమయంలో కోస్తా ఉత్తర ప్రాంతంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచన. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో జూన్ 12 నుండి జూన్ 14 వరకు పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ విభాగం. ఈ ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జూన్ 15 నుండి భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తూ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు మంగళవారం నాటికి చేరుకున్నాయి. రుతుపవనాలు అకోలా, పూసాద్, రామగుండం, సుక్మా, మల్కన్‌గిరి, విజయనగరం మీదుగా విస్తరించి ఉన్నాయి. IMD నివేదిక ప్రకారం రాబోయే 48 గంటల్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని మరిన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు చేరుకోడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి.