Weather Updates : తెలుగు రాష్ట్రాలలో మరో రెండు రోజులు తీవ్ర వడగాలులు
తెలుగు రాష్ట్రాలు ఎండలకు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. వస్తాయనుకున్న రుతుపవనాలేమో రాయలసీమలో ఆగిపోయాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ కేంద్రం అంటోంది. తెలంగాణలో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలు ఎండలకు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. వస్తాయనుకున్న రుతుపవనాలేమో రాయలసీమలో ఆగిపోయాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ కేంద్రం అంటోంది. తెలంగాణలో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా కుమురం భీం, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. దీంతో పాటు ఓ చల్లటి కబురు కూడా వాతావరణ కేంద్రం చెప్పింది. రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందట.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 478 మండలాలలో వడగాలులు వీస్తున్నాయి. పార్వతీపురం మన్యంలో 44.87 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. విజయనగరంలో 44, అనకాపల్లిలో 43.9, అల్లూరిలో 42.7, తూర్పుగోదావరిలో 42.5, ఏలూరులో 42.2, ఎన్టీఆర్ జిల్లా లో 41.9, విశాఖపట్నంలో 41.3, గుంటూరులో 41, బాపట్లలో 41, పలనాడులో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపటి నుంచి రాయలసీమ జిల్లాల్లో వేడిమి పరిస్థితులు తగ్గే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, కేరళలలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు ఏపీలోని శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగరి, కొప్పాల్ వరకూ విస్తరించి ఉన్నాయని తెలిపింది. ఈ నెల 18 నుంచి నైరుతి పవనాలు ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.