Weather Report : బలపడనున్న వాయుగుండం, రెండు రోజుల పాటు వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Pressure) బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. బుధవారం రాత్రి ఇది విశాఖపట్నానికి(Vishakapatnam) ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Pressure) బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. బుధవారం రాత్రి ఇది విశాఖపట్నానికి(Vishakapatnam) ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. తర్వాత ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యదిశగా వాయువ్య బంగాళాఖాతంవైపు(Bay Of Bengal) పయనిస్తూ గురువారం ఉదయానికి ఒడిశా తీరానికి, శనివారం ఉదయానికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఫలితంగా రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో(Rayalaseema) అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.