ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్(Thota Chandrashekar) ఆరోపించారు. కేంద్రం కుట్రలను సాగనివ్వమ‌న్నారు. "వైజాగ్ స్టీల్ ప్లాంట్" ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామ‌న్నారు. "విశాఖ ఉక్కు కర్మాగారం" ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఏపీలోని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. వైసీపీ(YSRCP), టీడీపీ(TDP) పార్టీలు ప్రధాని మోదీ(PM Modi) వద్ద మోకరిల్లాయని విమ‌ర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పై […]

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్(Thota Chandrashekar) ఆరోపించారు. కేంద్రం కుట్రలను సాగనివ్వమ‌న్నారు. "వైజాగ్ స్టీల్ ప్లాంట్" ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామ‌న్నారు. "విశాఖ ఉక్కు కర్మాగారం" ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఏపీలోని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. వైసీపీ(YSRCP), టీడీపీ(TDP) పార్టీలు ప్రధాని మోదీ(PM Modi) వద్ద మోకరిల్లాయని విమ‌ర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పై ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడమే కాదు.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర అభివృద్ధి కోసం 'బీఆర్ఎస్' పోరాటం చేస్తుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనీస అవగాహన లేకుండా ఏపీ కార్మిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్ ప్రక్రియలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్(KCR) నిర్ణయం తీసుకుంటారని వెల్ల‌డించారు. బైలడిల్లాలోని ఐరన్ వోర్ గనులను వైజాగ్ స్టీలు ప్లాంట్, బయ్యారంలకు కేటాయించి, తెలుగు ప్రజల హక్కులను కాపాడాలని బీజేపీని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అలుపెరుగని పోరాటం చేస్తామ‌ని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Updated On 11 April 2023 8:46 PM GMT
Yagnik

Yagnik

Next Story