మిచౌంగ్‌ తుఫాన్‌(Michaung Cyclone) గజగజలాడిస్తోంది. బాపట్ల(Baptla) తీరం తాకిన తుఫాను 12 గంటల తర్వాత తీరం దాటవచ్చు. తుఫాన్‌ ప్రభావంతో కోస్తాంధ్రలో(Andhra Coast) భారీ వర్షాలు(Heavy rain) కురుస్తున్నాయి.

మిచౌంగ్‌ తుఫాన్‌(Michaung Cyclone) గజగజలాడిస్తోంది. బాపట్ల(Baptla) తీరం తాకిన తుఫాను 12 గంటల తర్వాత తీరం దాటవచ్చు. తుఫాన్‌ ప్రభావంతో కోస్తాంధ్రలో(Andhra Coast) భారీ వర్షాలు(Heavy rain) కురుస్తున్నాయి. రాయలసీమనూ(Rayalaseema) ముంచెత్తుతోంది. అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్‌ కారణంగా రైల్వే కోడూరు(Koduru)-తిరుపతి(tirupati) వెళ్లే మార్గంలో కొండల పై నుంచి వర్షం నీళ్లు కిందకు పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాల నుంచి నీళ్లు జాలువారుతున్నట్లు రహదారులపైకి పెద్ద ఎత్తున నీళ్లు చేరుతున్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంత ఇబ్బందుల్లోనూ జలపాతలను చూస్తూ సంతోషపడుతున్నారు. రెండు రోజులుగా తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

Updated On 5 Dec 2023 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story