AP MLA Quota MLC Elections||ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు..!||Journalist YNR
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ(YCP) అన్ని స్థానాలను గెలుచుకుంటామని చెబుతుండగా, ఒక్క స్థానంలో గెలుపుపై టీడీపీ(TDP) ఆశలు పెట్టుకుంది.

AP MLA Quota MLC Elections
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ(YCP) అన్ని స్థానాలను గెలుచుకుంటామని చెబుతుండగా, ఒక్క స్థానంలో గెలుపుపై టీడీపీ(TDP) ఆశలు పెట్టుకుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. వైసీపీకి ఎక్కువ మెజారిటీ ఉండటంతో.. వైసీపీ ఆన్ని స్థానాలు గెలిచే అవకాశమున్నా.. ఒక్క స్థానంపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల బలానికి వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy ), కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)మద్దతు ఇస్తే మాత్రం టీడీపీ ఒక సీటు గెలిచే అవకాశం ఉంది... అయితే టీడీపీకి వారు మద్దతు ఇస్తారో లేదో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
